జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లోని ఒక ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ పోలీసు కస్టడీ నుండి తప్పించుకున్నాడు. షేక్ భిఖారీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. తన దగ్గరున్న ఇనుప రాడ్‌తో ఆస్పత్రి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.
ప్రజారోగ్య మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చాలాకాలంగా ప్రభుత్వ ఆమోదం కోసం మాజీ డీహెచ్ శ్రీనివాసరావు వేచి చూస్తుండగా.. ఈ క్రమంలో.. ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై మంత్రి టిఎం అన్బరసన్‌పై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఎఐఎడిఎంకె (AIADMK) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన డీఎంకే కార్యక్రమంలో అన్బరసన్ మాట్లాడుతూ.. ఇటీవల రాజకీయ పార్టీని ప్రారంభించిన తమిళ నటుడు తలపతి విజయ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఖండించారు. ముఖ్యంగా హిందువులు, క్రైస్తవులు.. బౌద్ధులపై నిరంతర దాడుల నివేదికలు కలవరపెడుతున్నాయని, బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం వారి భద్రతకు భరోసా ఇస్తుందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలిపారు. 'మతం, కులం, భాష లేదా గుర్తింపు ఆధారంగా వివక్ష, హింస.. దాడులు ఏ నాగరిక సమాజంలోనూ ఆమోదయోగ్యం కాదు' అని 'X' లో పోస్ట్ చేశారు.
రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి డజను జింకలను వేటగాళ్లు చంపేశారు. ఈ ఘటనపై సోమవారం సీనియర్ అటవీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చోహ్తాన్ సర్కిల్ ఆఫీసర్ కృతికా యాదవ్ తెలిపారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
బంగ్లాదేశ్లో కొనసాగుతున్న నిరసనలు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని తొలగించడానికి దారితీసింది. బంగ్లాదేశ్‌లో నిరసనలకు విద్యార్థులే నాయకత్వం వహించినట్లు కనిపించినప్పటికీ.. ముఖ్యంగా మైనారిటీ హిందువులపై హింస ఉగ్రవాద సంస్థలచే నిర్వహించబడిందని నిఘా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా.. ఉగ్రవాద సంస్థల నుండి భారతదేశానికి ముప్పు పెరుగుతోందని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు సమాచారం.
మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్‌ను రాజ్యసభ ఎంపీగా చేయాలని హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి, జననాయక్ జనతా పార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. రాజ్యసభలో నలుగురు నామినేటెడ్ సభ్యుల సీట్లు ఖాళీగా ఉన్నాయని.. వాటిని రాష్ట్రపతి త్వరలో నలుగురు సభ్యులను నామినేట్ చేస్తారని దుష్యంత్ చౌతాలా తెలిపారు. భారతదేశపు గొప్ప క్రికెటర్ సచిన్ టెండూల్కర్ లాగా, దేశ వీర కుమార్తె వినేష్ ఫోగట్‌ను కూడా రాష్ట్రపతి.. ప్రధానమంత్రి రాజ్యసభకు నామినేట్ చేయాలన్నారు.
ఆదివారం అర్థరాత్రి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని కరీంగంజ్ సెక్టార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. వారిని మోటియుర్ సేఖ్, ముషియార్ ముల్లా, తానియా ముల్లా.. రీటా ముల్లాగా గుర్తించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ 'X' లో తెలిపారు.
మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భింద్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు పీచు మిఠాయి ఇస్తానని ఆశ చూపి దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు ఓ కిరాణం షాపును నడుపతున్నాడు. కాగా.. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
10 మంది వ్యక్తులు ముఖానికి ముసుగులు ధరించుకుని వచ్చి ఓ కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున న్యూ అశోక్ నగర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన మామే తమపై దాడి చేశారని బాధితురాలు కాజల్ ఆరోపిస్తుంది. ఆస్తి తగాదా విషయంలో దాడికి పాల్పడినట్లు చెబుతుంది.