అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవని.. జీవ సంబంధమైన తల్లిదండ్రులుగా చెప్పుకోలేరని బాంబే హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. కాగా.. తన ఐదేళ్ల చిన్నారికి సందర్శన హక్కు కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ మిలింద్ జాదవ్‌తో కూడిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది.
వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ చెవి వ్యాధులు రావడం సాధారణమని భావిస్తారు. అయితే ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రమాదం యువకులలో కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలి నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, ఇయర్‌బడ్‌లు.. హెడ్‌ఫోన్‌ల వాడకం పెరుగుతున్నందున వినికిడి లోపం.. చెవుడు కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
జియో వినియోగదారులకు గుడ్ న్యూస్. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలను అందివ్వనుంది. అందుకోసం.. రిలయన్స్ జియో కొన్ని గొప్ప ప్లాన్‌లను మీ ముందుకు తీసుకొస్తుంది. జియో టాప్ 3 ప్లాన్లు తమ వినియోగదారులకు అందించబోతుంది. ఈ ప్లాన్‌లలో మీరు 84 రోజుల చెల్లుబాటుతో రోజుకు 3 GB డేటాను పొందుతారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో దేశ పతాకధారిగా నిలవడం గర్వించదగ్గ విషయమని పిస్టల్ షూటర్ మను భాకర్ అన్నారు. పారిస్‌లో రెండు పతకాలు సాధించిన భారత పిస్టల్ షూటర్ మను భాకర్ ఒలింపిక్స్‌లో ఎన్నో పతకాలపై కన్నేసింది. పతకాలు సాధించేందుకు తాము ఎంతో కష్టపడుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో తాను ఒకే ఒలింపిక్స్‌లో రెండు కంటే ఎక్కువ పతకాలు సాధించగలిగితే అది గొప్ప అని పేర్కొన్నారు. కష్టపడి పనిచేస్తే.. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన చూపించగలం.. తద్వారా భవిష్యత్తులో భారత్‌కు మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధించాలని కోరుకుంటున్నానని…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో చాలాసార్లు వేలం నిర్వహించిన ప్రముఖ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మిడెస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరపున ఆడుతున్న విరాట్ కోహ్లీ 2025 ఐపీఎల్ వేలంలోకి వస్తే.. అతను ఈజీగా 30 కోట్ల రూపాయలకు పైగా పొందగలడని హ్యూ ఎడ్మిడెస్ చెప్పారు.
త్వరలో సమర్ 2 (SAMAR 2) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇది శత్రువులను ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. దీనిని స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈ క్షిపణి పరిధి దాదాపు 30 కిలోమీటర్లు. కాగా.. ఈ క్షిపణి గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మంగళవారం ఈ సమాచారాన్ని అందించారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కష్టాల ఊబిలో కూరుకుపోతుంది. తాజాగా.. ఆమెపై హత్య కేసు నమోదైందని సమాచారం అందుతోంది. ఈ కేసులో హసీనాతో పాటు పలువురి అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి. బంగ్లాలో గత కొన్ని వారాలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నిరసనల్లో 500 మందికి పైగా మరణించారు. ఈ క్రమంలో.. హసీనా తన పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి వెళ్లింది.
పట్టపగలే ఓ వ్యక్తిపై మైనర్ బాలుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలోని శివాజీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఈ దాడిలో ఆ వ్యక్తి మృతి చెందాడు. బాధితుడిపై బాలుడు పదే పదే కత్తితో దాడికి పాల్పడుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు పాల్పడుతుండగా.. అక్కడే ఉన్న కొంతమంది ఆపలేకపోయారు. అలానే చూస్తూ ఉండిపోయారు. కాగా.. ఈ దాడికి సంబంధించి అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. మృతుడు అహ్మద్ పఠాన్‌గా పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి హెర్నియా కోసం శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో డాక్టర్లు షాక్ కు గురయ్యారు. అతని శరీరం లోపల స్త్రీ పునరుత్పత్తి అవయవాలను కనుగొన్నారు.
బీసీసీఐ గొప్ప మనసు చాటుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత.. నేపాల్ క్రికెట్ జట్టుకు భారత్లో సాయం అందించేందుకు ముందుకొచ్చింది. కాగా.. బీసీసీఐ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌ను భారతదేశంలో తన మ్యాచ్‌లను నిర్వహించడానికి అనుమతించింది. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రెండు వారాల ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనేందుకు నేపాల్ జట్టుకు బీసీసీఐ అనుమతినిచ్చింది.