పంజాబ్లో ఓ ఏఎస్సై యువకులపై దురుసుగా ప్రవర్తించారు. ఏఎస్సై జస్వీందర్ సింగ్ భోగ్‌పూర్లో ఇద్దరు యువకులపై అందరూ చూస్తుండగానే తీవ్రంగా కొట్టాడు. కాగా.. అక్కడున్న కొందరు స్థానికులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది కాస్త వైరల్‌గా మారింది.
కోల్‌కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలని పోలీసులకు తెలిపారు.
భారతదేశ స్వదేశీ యుద్ధ విమానాల తయారీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఈ సిరీస్‌లో 4.5 జనరేషన్ ప్లస్ LCA మార్క్ 2 ఫైటర్ జెట్ మార్చి 2026 నాటికి గాల్లో ఎగురనున్నాయి. అలాగే.. 2029 నాటికి ఈ యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభం కానున్నాయి. కాగా.. భారతీయ ఐదవ తరం ఫైటర్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ 2035 నాటికి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో.. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అంతేకాకుండా.. జలపాతాల వద్ద సందర్శకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జైపూర్‌కు సమీపంలోని కనోటా డ్యామ్ కూడా నీటి ప్రవాహం భారీగా ప్రవహిస్తోంది. అయితే.. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులు ఈ డ్యామ్ చూసేందుకు వచ్చారు. కాగా.. డ్యాం సందర్శనకు వచ్చిన వారిలో ఐదుగురు యువకులు డ్యామ్ నీటిలో కొట్టుకుపోయారు.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడప మున్సిపాలిటీలోని ఎం.కన్వెన్షన్ నందు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా.. ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనసభ్యులు, పలువురు ప్రముఖులు వెంకయ్య నాయుడుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ ఆవిష్కరించిన పుస్తకాలను అతిధులకు అందజేశారు.
కాసేపట్లో పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ కార్యక్రమానికి ముందు పారిస్లో ఒలింపిక్ నిర్వాహకులు ఊహించని సంఘటన జరిగింది. పారిస్‌లోని చారిత్రక ఈఫిల్ టవర్‌ను ఓ వ్యక్తి అధిరోహించాడు. దీంతో అధికారులు హడావుడిగా ఈఫిల్ టవర్ ప్రాంతం చుట్టూ ఉన్న వారిని అక్కడి నుంచి పంపించారు.
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఆదివారం ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. కర్ణాటకలోని బెళగావి ఏవియేషన్ అకాడమీకి చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తించారు. కాగా.. ఇంజిన్ ఫెయిల్ అవడంతో ఈ ఘటన జరిగింది.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగిఉన్న కారును మాధురి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురికి గాయాలు కాగా.. పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మాధురిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. కాగా.. పలాస ఆసుపత్రిలో చికిత్స తీసుకునేందుకు ఆమె నిరాకరించారు. చాలా సేపు బలవంతం చేసిన తర్వాత వైద్యులు చికిత్స అందించారు.
ఓ వివాహ వేడుకకు అని బయల్దేరిన ఒకే కుటుంబానికి చెందిన 12 మంది సభ్యుల్లో 11 మంది మృతి చెందారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. భటోలి గ్రామానికి చెందిన వీరంతా ఓ వివాహ శుభకార్యానికి అని బయల్దేరారు. అయితే.. మార్గమధ్యలో జెజో ప్రాంతంలో వాగులో పడి ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 11 మంది చనిపోగా.. ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. మృతులు రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబంగా గుర్తించారు. తండ్రి కృష్ణ రైల్వే లైన్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే.. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలను వెంట తీసుకుని వెళ్లాడు. తండ్రి కృష్ణ పిల్లలను ట్రాక్‌పై కూర్చోబెట్టి పని చేస్తున్నాడు. ఇంతలోనే ట్రాక్‌పైకి ట్రైన్ రావడంతో పిల్లలను కాపాడబోయాడు. కానీ.. వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.