Assam Police: భారత్లోకి ప్రవేశించేందుకు నలుగురు బంగ్లాదేశీయులు యత్నం..
- ఆదివారం అర్థరాత్రి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో నలుగురు బంగ్లాదేశ్ పౌరులను అడ్డుకున్న పోలీసులు
- కరీంగంజ్ సెక్టార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశీయులు
- మోటియుర్ సేఖ్.. ముషియార్ ముల్లా.. తానియా ముల్లా.. రీటా ముల్లాగా గుర్తింపు
- ఈ విషయాన్ని 'X' లో తెలిపిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదివారం అర్థరాత్రి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని కరీంగంజ్ సెక్టార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. వారిని మోటియుర్ సేఖ్, ముషియార్ ముల్లా, తానియా ముల్లా.. రీటా ముల్లాగా గుర్తించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ‘X’ లో తెలిపారు. “ఈ రోజు తెల్లవారుజామున 1:30 గంటలకు బంగ్లాదేశ్ పౌరులు మోటియుర్ సేఖ్, ముషియార్ ముల్లా, తానియా ముల్లా మరియు రీటా ముల్లా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని కరీంగంజ్ సెక్టార్ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే.. జీరో పాయింట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. తక్షణమే వారిని తిరిగి పంపించారు” అని సీఎం ‘X’ లో పోస్ట్ చేశాడు.
Botsa Satyanaryana: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బొత్స సత్యనారాయణ
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు ఈశాన్య ప్రాంతాలకు ఆందోళన కలిగించే విషయమని.. అక్కడి ప్రజలు సరిహద్దు గుండా ప్రవేశించే అవకాశం ఉందని.. పొరుగు దేశం వారికి ఈ ప్రాంతం నుండి తిరుగుబాటుదారుల కేంద్రంగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి గతంలో చెప్పారు. ఈ క్రమంలో.. రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన నిఘాను కొనసాగిస్తున్నదని.. అందుకే సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని ముఖ్యమంత్రి బిశ్వశర్మ తెలిపారు, ప్రస్తుతానికి.. చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, వీసా.. భారత పౌరులు తప్ప ఎవరూ బంగ్లాదేశ్ నుండి దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించేదిలేదని ఆయన పేర్కొన్నారు.
Madya Pradesh: పీచు మిఠాయితో ఎనిమిదేళ్ల బాలికకు ఎర.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం
మరోవైపు.. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లోకి ఎవరూ అక్రమంగా ప్రవేశించకుండా ఉండేలా హై అలర్ట్ జారీ చేసినట్లు అస్సాం పోలీస్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ తెలిపారు. సరిహద్దు వెంబడి బీఎస్‌ఎఫ్, అస్సాం పోలీసులు నిఘా కాస్తున్నారని చెప్పారు. కాగా.. ఆదివారం తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్, త్రిపుర.. మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా భారతదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న 11 మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) ఆదివారం తెలిపింది. కాగా.. బంగ్లాదేశ్ లో పరిస్థితుల దృష్ట్యా చాలా మంది బంగ్లాదేశ్ పౌరులు భారత్ లోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారు. కాగా.. వారిని భద్రతా దళాలు అడ్డుకుంటున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో అనేక పాయింట్ల వద్ద బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) సహాయంతో గత కొన్ని రోజులుగా వేలాది మంది బంగ్లాదేశ్ ప్రజలను వెనక్కి పంపించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!