ప్రజారోగ్య మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్)ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చాలాకాలంగా ప్రభుత్వ ఆమోదం కోసం మాజీ డీహెచ్ శ్రీనివాసరావు వేచి చూస్తుండగా.. ఈ క్రమంలో.. ఆయన వీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది. శ్రీనివాసరావు ప్రజారోగ్య విభాగంలో జాయింట్ డైరెక్టర్ కేడర్లో పని చేశాడు. కాగా.. ప్రభుత్వం ఆయనను గత నెల 27న మహబూబాబాద్ అడిషినల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా నియమించింది.
Read Also: Bangladesh: షేక్ హసీనాకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నుంచి సందేశం
కానీ.. గడల శ్రీనివాసరావు ఆ పోస్టింగ్ లో జాయిన్ అవ్వలేదు. ఆయన ఇంచార్జ్ డీహెచ్ పోస్ట్ నుంచి తప్పుకున్నాక ఆయన లాంగ్ లీవ్ లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసరావు రెండుసార్లు వీఆర్ఎస్ కు అప్లై చేశాడు. తాజాగా.. ఆయన వీఆర్ఎస్ ను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. శ్రీనివాసరావు వీఆర్ఎస్ తో పాటు మరో ముగ్గురు ఏడీపీహెచ్‌వోలను కూడా బదిలీ చేస్తూ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Minister Ramprasad Reddy: అమరావతి నిర్మాణానికి మంత్రి విరాళం