కొన్ని నిమిషాల్లో పెళ్లి అయిపోతుందనే సమయానికి పెళ్లి వేదికకు ప్రియురాలి వచ్చి హల్ చల్ చేసింది. దీంతో.. పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో వివాహం జరగాల్సి ఉంది. అయితే.. వరుడు సయ్యద్ భాషాతో తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం ఉంది. కాగా.. తన ప్రియుడికి వేరే అమ్మాయితో వివాహం అవుతుందని తెలుసుకుని పెళ్లి వేదికకు వచ్చింది.
రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలోని ఇద్దరు అక్కాచెల్లెళ్ల అపహరణ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో నిందితుడు మారోజు వెంకటేశ్ నేర చరిత్ర బయటకు వస్తుంది. విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ ఇద్దరు మైనర్ బాలికలను అపహరించాడు. మారోజు వెంకటేష్ మోసగాడని పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో దివ్వెల మాధురి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. కారులో వెళ్తున్న మాధురి.. ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి స్థానికులు ఆమెను పలాస ఆస్పత్రికి తరలించారు.
కర్ణాటకలోని హోస్పేట్లో గల తుంగభద్ర జలాశయం ఉన్న 33 గేట్లలో 19వ గేటు వరద నీటి దాటికి కొట్టుకుపోయింది. దీంతో ఆ గేటు నుంచి ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళుతుంది. వాస్తవంగా తుంగభద్ర జలాశయానికి వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్ లింక్ తెగి కొట్టుకుపోయింది. దీంతో.. కర్ణాటక అధికారులు తలలు పట్టుకున్నారు.
పల్నాడు ప్రాంతం పర్యాటకులతో పోటు ఎత్తుతుంది. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ద్వారా దిగువ ప్రాంతానికి భారీగా వరద నీరు వదలడంతో.. ఆ సుందర దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. గడిచిన కొద్దీ రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు హాజరవుతున్నారు. నేడు ఆదివారం కావడంతో హైదరాబాద్ నుండి కూడా.. పెద్ద ఎత్తున పర్యాటకులు నాగార్జునసాగర్ సమీపంలోని సుందర జలపాతాలను సందర్శిస్తున్నారు.
విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. 5వ అంతస్తు అడ్మిన్ బ్లాక్లో మొదలైన మంటలు.. ఇతర బ్లాకుల్లోకి వ్యాపించాయి. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న పేషంట్లకు ఇబ్బంది తలెత్తకుండా ఆస్పత్రి సిబ్బంది చర్యలు చేపట్టారు.
వినేశ్ ఫోగట్ పిటిషన్‌పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈరోజు ఆమె పిటిషన్ పై తీర్పు వస్తుందని అందరూ అనుకున్నప్పటికీ, పారిస్ స్పోర్స్ కోర్ట్ తీర్పు వాయిదా వేసింది. 24 గంటలపాటు నిర్ణయాన్ని పొడిగించింది. రేపు (ఆదివారం) తీర్పు వెలువడే అవకాశం ఉంది. కాగా.. ఈరోజు(శుక్రవారం నాడు) కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) కోర్టులో వినేష్ ఫోగట్ పిటిషన్ పై విచారణ జరిగింది.
కాంస్య పతకం సాధించిన రెజ్లర్ అమన్ సెహ్రావత్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అభినందించారు. 'నువ్వు కష్టపడి ఇక్కడికి చేరుకున్నావు కాబట్టి నీ జీవితం దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారుతుంది' అని అమన్తో ప్రధాని అన్నారు.
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పనికి శ్రీకారం చుట్టబోతుంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుండగా.. తాజాగా మరో కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. అందుకు సంబంధించిన సమాచాారాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 15వ తేదీన లాంఛనంగా రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
విజయవాడలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి, శిలాఫలకం ధ్వంసం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై దుండగులు చేసిన దాడి ఘటనను, రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఈ దాడిని నిరసిస్తూ.. వైసీపీ శ్రేణులు గుంటూరు శంకర్ విలాస్ నుండి లాడ్జి సెంటర్ వరకు క్యాండిల్ నిరసన ర్యాలీ చేశారు.