టీమిండియా బౌలింగ్ కోచ్గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ సెలక్ట్ అయినట్లు క్రిక్ బజ్ (Cricbuzz) తెలిపింది. ఆయన నియామకంపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ రికమెండ్ చేయడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోర్కెల్ సెప్టెంబర్ 1 నుంచి బౌలింగ్ కోచ్గా బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ జిల్లాలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఒక మగ టీచర్, ఒక మహిళా టీచర్ ఒకరినొకరు చెప్పుతో కొట్టుకోవడం కనిపించింది. ఈ సమయంలో మగ ఉపాధ్యాయుడు స్వయంగా వీడియో తీస్తున్నాడు. దీనిపై మరింత ఆగ్రహించిన మహిళా ఉపాధ్యాయురాలు అతనిని చెంపదెబ్బ కొట్టింది. నువ్వు వీడియో తీస్తావు అని మహిళా టీచర్ మగ టీచర్ పై రెచ్చిపోయింది.
రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై నిర్ణయం ఆలస్యం కావడంపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జై ప్రకాష్ చౌదరి స్పందించారు. వినేశ్కు అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పారు. వినేష్‌కి కచ్చితంగా అనుకూలంగా నిర్ణయం వస్తుందని అనుకుంటున్నాను.. కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.. ఆమెకు పతకం ఖచ్చితంగా వస్తుందన్నారు. అయితే.. వినేశ్ ఫైనల్ కు ముందు బరువు పెరగడం ఆమె సిబ్బంది తప్పు అని అన్నారు. ఏదేమైనప్పటికీ.. ఆగస్ట్ 16న ఏం జరుగుతుందో చూద్దాం... మనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని…
నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న సాక్ష్యాధారాలు లేని కారణంగా ఓ ఖైదీకి విధించిన జీవిత ఖైదును అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలో అతన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ అప్పీల్ పై తీర్పు మరోసారి వాయిది పడింది. ఆగష్టు 16న తీర్పు వెల్లడిస్తామని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తెలిపింది. వినేష్ ఫోగట్‌కు రజత పతకం ఇస్తారా లేదా అనేది స్పోర్ట్స్ కోర్టు నిర్ణయించనుంది.
ఐసిసి రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ, ''ఇది చాలా ఆసక్తికరమైన సిరీస్ కానుంది. ఇక్కడ గత రెండు సిరీస్‌లలో ఏమి జరిగిందో చూస్తే, ఆస్ట్రేలియాలో భారత్‌పై ఆస్ట్రేలియా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. మేము ఇప్పుడు భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడతాము, ఇది రెండవ అత్యంత ముఖ్యమైన విషయం. ఇటీవలి కాలంలో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదు టెస్టులపై అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పెద్దగా డ్రా అయ్యే టెస్టులు ఉండకపోవచ్చు" అని పాంటింగ్ అన్నాడు. ఇక ఈ సిరీస్.. ఆస్ట్రేలియా గెలుస్తుందని.. నేనెప్పుడూ…
యూపీలోని కాన్పూర్ లో ఓ ప్రేమికుడు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రేమికుడు.. తన ప్రియురాలి కుటుంబంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నీ కూతురిని తనకిచ్చి పెళ్లి చేయాలని.. లేదంటే రక్తం కళ్ల చూడాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా.. ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే, అక్కడికెళ్లి తీసుకొస్తానని చెప్పాడు. అందుకే ఎవరితోనూ పెళ్లి చేయకని సూచించాడు.
యూపీలోని హమీర్‌పూర్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి పారిపోయి ప్రియుడి కోసం వస్తే.. ప్రియురాలిపై యువకుడి తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతకు ముందు.. ప్రియుడు, ప్రియురాలు వీరి పెళ్లి కోసం నకిలీ పత్రాలు తయారు చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియుడు ఆమెను ఇంటికి తీసుకురాగా.. తండ్రీకొడుకులు కలిసి బాలికపై అత్యాచారం చేశారు. అయితే.. ఆ ఇద్దరి బారి నుంచి ఎలాగోలా తప్పించుకుని బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తండ్రీకొడుకులపై అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేసింది.
రోగులపై ఓ వైద్యుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఒడిశాలోని కటక్‌లోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కాగా.. ఇద్దరు రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి బంధువులు ఆ వైద్యుడిని చితకబాదారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. నలసోపరా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్యూషన్ క్లాస్‌లో నిందితుడు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడైన స్కూల్ టీచర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అమిత్ దూబే (30)గా గుర్తించినట్లు తెలిపారు.