బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఖండించారు. ముఖ్యంగా హిందువులు, క్రైస్తవులు.. బౌద్ధులపై నిరంతర దాడుల నివేదికలు కలవరపెడుతున్నాయని, బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం వారి భద్రతకు భరోసా ఇస్తుందని ఆశిస్తున్నట్లు ప్రియాంక గాంధీ తెలిపారు. ‘మతం, కులం, భాష లేదా గుర్తింపు ఆధారంగా వివక్ష, హింస.. దాడులు ఏ నాగరిక సమాజంలోనూ ఆమోదయోగ్యం కాదు’ అని ‘X’ లో పోస్ట్ చేశారు. “బంగ్లాదేశ్‌లో పరిస్థితి త్వరలో సాధారణం అవుతుందని.. అక్కడి మధ్యంతర ప్రభుత్వం హిందూ, క్రైస్తవ.. బౌద్ధ మతాలను అనుసరించే ప్రజలకు భద్రత, గౌరవాన్ని అందజేస్తుందని మేము ఆశిస్తున్నాము” అని ప్రియాంకా గాంధీ తెలిపారు.
Read Also: NBK 109: బాలయ్యతో కీలక ఘట్టం ముగిసింది.. బాబీ ఆసక్తికర పోస్ట్
గత వారం షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత.. అక్కడ చెలరేగిన హింసాత్మక సంఘటనలలో 500 మందికి పైగా మరణించారు. కాగా.. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ అశాంతి నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా.. బంగ్లాదేశ్లో హిందూ సంఘాలను టార్గెట్ చేశారన్నారు. షేక్ హసీనా దేశం విడిచి భారతదేశానికి పారిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో జరిగిన హింసలో అనేక హిందూ దేవాలయాలు, గృహాలు.. వ్యాపారాలు ధ్వంసం చేశారన్నారు. అంతేకాకుండా.. హిందూ మహిళలపై దాడులు జరిగాయని తెలిపారు. అవామీ లీగ్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఇద్దరు హిందూ నాయకులు మరణించారని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.
Read Also: IMD Rain Alert: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన