జుత్తాడ గ్రామంలో భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు గ్రామస్తులు. అంతే కాక జుత్తాడ గ్రామం నిర్మానుష్యంగా మారుతోంది. ఇళ్లకు తాళాలు వేసుకుని వేరే ఊళ్లకు గ్రామస్థులు పయనమవుతున్నారు. ఘటన జరిగిన శెట్టిబలిజ వీధి లో పోలీసుల పహారా కాస్తున్నా సరే ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటున్నామని మహిళలు అంటున్నారు. అంగన్వాడీ లకు, స్కూల్స్ కు తమ పిల్లలను పంపాలంటే కూడా తల్లిదండ్రులు భయపడుతున్నారు. భయం తో రాత్రుళ్లు మేల్కొనే ఉంటున్నామని గ్రామ […]
ఐఏఎస్ ను అంటూ బురిడీ కొట్టించాడు..జాయింట్ పోస్టింగ్ వచ్చిందని నమ్మించాడు..నేమ్ ప్లేట్ రెడీ చేసుకున్నాడు..సైరన్ పెట్టుకున్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తానని చెప్పి ముందుగా డ్రైవర్ ,పీఏను నమ్మించి వేతనాలు పెంచాడు…అలా నమ్మించి ఒక్కటి కాదు రెండు ఏకంగా 80 లక్షలు వసూలు చేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాదితులు స్టేషన్ మెట్లెక్కితే సూడో ఐఏఎస్ అని తేల్చిన ఖాకీలు అసలు బాగోతం బయటపెట్టారు. బర్ల లక్ష్మీనారాయణ, హైదరాబాద్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు..ఈ క్రమంలో తన గ్రామంలో […]
కరోనా రాకముందు నిర్లక్ష్యం. కరోనా వచ్చిన తరవాత దారుణం. ఇప్పుడు ఇదే పరిస్థితి… దేశంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ కనిపిస్తోంది. ఒక్కో వ్యక్తి నుంచి ఎంత మందికి వైరస్ సోకుతుందో తెలియడం లేదు. నిర్లక్ష్యంగా జనంతో కలిసి తిరుగుతున్న కరోనా బాధితులు! కరోనా మొదటి వేవ్ జనాలను ఊచకోత కోసింది. సెకండ్ వేవ్ ఉధృతంగా చొచ్చుకెళ్తోంది. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా తేలిగ్గా తీసుకుంటున్నారు జనాలు. కేసులు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం చాలామంది కరోనా వచ్చిన వాళ్ళు […]
కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ఆలయాలను మూసేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ప్రధాన ఆలయాల్లో దర్శనాలు నిలిపివేశారు . తాజాగా చిన్న చిన్న గుడులకు సైతం తాళం వేస్తున్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ ఇంద్రప్రస్తా కాలనీలోని అభయాంజనేయస్వామి దేవాలయాన్ని మూసివేశారు. గుడి బయట నుంచే దండం పెట్టుకొని వెళ్లిపోతున్నారు భక్తులు. ఇక శ్రీరామనవమి వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి […]
కరోనా మహమ్మారి విజృంభణతో యావత్ దేశం మరోసారి చిగురుటాకులా వణుకుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు, మరణాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలు నమోదవడం కొవిడ్ తీవ్రతను కళ్లకు కడుతోంది. తొలుత ఈ రెండో దశ ఉద్ధృతి మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు చాపకింద నీరులా దేశమంతా వ్యాపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ మొత్తం కేసుల్లో సగం.. కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, […]
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. దొంగ ఓట్లు వేసేందుకు బయట నుంచి వేల మందిని తిరుపతికి తరలించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతిలోని లక్ష్మీపురం, కెనడీనగర్ కూడలి వద్ద తెదేపా నేతలు నిరసనకు దిగారు. ప్రైవేటు బస్సులను ఆపి టీడీపీ నేతలు దాని బైఠాయించారు. ఎన్నికల సంఘం, పోలీసులు దొంగ ఓట్లు మీద ఏ మాత్రం దృష్టి సారించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. మరో వైపు దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని టీడీపీ నేతలు […]
ఇవాళ తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉపఎన్నికలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించారు. మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందూరుతో పాటు నారాయణ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో తమ గ్రామాలను విలీనం ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు గ్రామస్థులు. గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించడంతో ఒక్క ఓటరూ రాక బోసిపోయింది ఊరందూరు పోలింగ్ స్టేషన్. ఇప్పటికీ ఒక్క ఓటు కూడా పోల్ అవ్వని పరిస్థితి […]
ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో కరోనా సెకండ్ వేవ్ భయం నెలకొంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి.పద్మా రావు కరోనాతో మృతి చెందారు. శుక్రవారం సచివాలయంలో 200 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఆ ఫలితాలు రావలసి ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఉద్యోగులు […]
నేతలంతా ఎన్నికల హడావిడిలో ఉన్నారు. ప్రభుత్వ పెద్దలు కరోనా నియంత్రణపై ఫోకస్ పెట్టారు. ఇదే టైమ్ అనుకున్నారో ఏమో ఏపీ ఎక్సైజ్శాఖలోని కొందరు సిబ్బంది కొత్తరకం దందాకు తెరతీశారు. సరికొత్త స్టిక్కర్ లిక్కర్ స్కామ్ బయటపడింది. ఇందులో సిబ్బంది, అధికారుల పాత్రే ఉందా లేక రాజకీయ నేతల జోక్యం కూడా ఉందా అన్నది ఆరా తీస్తున్నారట. తక్కువ రేటు ఉన్న బాటిళ్లకు ఎక్కువ రేటు ఉన్న స్టిక్కర్లు! అవినీతి చేయడానికి సందు దొరకాలే కానీ.. కొందరు అక్రమార్కులు […]
లింగోజిగూడ డివిజన్ కు జరగనున్న ఉప ఎన్నికల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ విజ్ఞప్తి మేరకు పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో లింగోజిగూడ డివిజన్ నుంచి ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్ శ్రీ ఆకుల రమేష్ గౌడ్ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా మృతి చెందారు. ఈ డివిజన్ కు ఏప్రిల్ 30 నాడు జరగనున్న ఉప ఎన్నికల్లో రమేష్ గౌడ్ కుమారుడు పోటీ చేస్తున్నందున […]