తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక అలజడి రేపుతోందా? చాలా రోజుల తర్వాత AICC ఇంచార్జ్ రాష్ట్రానికి రావడంతో పార్టీలో ముఖ్య నేతలు ఆరా తీస్తున్నారా? అధిష్ఠానం పెట్టిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల గడువు దగ్గర పడటంతో కొత్త సారథిపై మంతనాలు జోరందుకున్నాయా? పీసీసీ చీఫ్ ఎంపికపై ఇన్నాళ్లూ అలికిడి లేదు! నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చడంతో దాదాపు 3 నెలలుగా పార్టీ నేతలు సైలెంట్‌గా […]
పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని చోట్ల అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. ఈ క్రమంలో కొందరు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడా భాగోతాలు వెలుగులోకి రావడంతో ఓ కీలక అధికారి చక్రం తిప్పుతున్నారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల మేత! కృష్ణాజిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో మొత్తం వెయ్యికిపైగా పంచాయతీలు ఉన్నాయి. విజయవాడ రూరల్ డివిజన్లోని మేజర్ పంచాయతీల ఆదాయం […]
తిరుపతి లోక్‌సభ స్థానానికి, నాగార్జున సాగర్ శాసనసభ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ గతికి సూచికలు అవుతాయి. ఈ రెండు కూడా అధికార పార్టీ స్థానాలు కావడం ఇక్కడ ఉమ్మడి అంశం. ఫలితాల సరళిని గురించి మాత్రం భిన్నమైన అంచనాలున్నాయి గనక భావి రాజకీయ విశ్లేషణ కూడా తదనుగుణంగానే ఉంటుంది. తిరుపతిలో అధికార వైఎస్ఆర్పార్టీ అభ్యర్థి గురుమూర్తికి సమీప ప్రత్యర్థిగా టిడిపి పనబాక లక్ష్మి ఉండగా బిజెపి తరపున రత్న […]
ఆర్థిక సాయం అంశంలో ప్రైవేట్ స్కూల్స్ బండారం బయట పడింది. 2 వేల ఆర్థిక సహాయం,25 కేజీల బియ్యం కోసం భారీగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ లో బోధన, బోధనేతర సిబ్బంది సంఖ్య లక్ష 45 వేలు, ఈ లెక్కలు ప్రైవేట్ స్కూల్స్ జిల్లా విద్యా సమాచార వ్యవస్థ లో పొందు పరచినవే. ఇందులో లక్షా 18 వేలు టీచింగ్ స్టాఫ్,27 వేలు నాన్ టీచింగ్ స్టాఫ్ […]
బ్రిక్స్ ఇన్ఫ్రాటెక్ నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని హైకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. భూ యజమానులు పిటిషన్ దాఖలు చేశారు. శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 177లో ఉన్న బీ 499 నుంచి బీ 501 ప్లాట్లలో భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయాలని పిటీషన్ దాఖలు అయింది. బ్రిక్స్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ భాగస్వాములు తమ అక్రమించారని పిటీషన్ దాఖలు చేశారు. భూవివాదం తేలేవరకు జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన నిర్మాణ అనుమతులు రద్దు […]
ఆంధ్రా భద్రాద్రి గా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి కరోనా ఎఫెక్ట్ పడింది..రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని మూసివేస్తూ కేంద్ర పురావస్తుశాఖ మరియు టీడీటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు..అయితే ఈ నెల 21వ తేదీ నుంచి జరగాల్సిన ఒంటిమిట్ట రాములవారి కల్యాణం సైతం భక్తులు లేకుండా ఏకాంతంగా జరపాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది..రోజు రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి..ఈ […]
ప్రస్తుతం రెండో విడత కరోనా విజృంభించడంతో విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో వర్తకులు స్వతహాగా లాక్ డౌన్ ప్రకటించారు.. బొబ్బిలి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కిరాణా ,సిల్వర్, స్టీల్ మర్చంట్ కొబ్బరి మరియు కూరగాయల సముదాయాల వ్యాపారులు ముందుకు వచ్చి ప్రత్యేక లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే షాపులు తెరుస్తామని, సుమారు సుమారు వారం రోజుల పాటు ఉంటుందనీ కిరాణా వర్తక సంఘం […]
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలలో స్కూల్స్, కాలేజీల్లో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ కేసులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ తో పాటు కాలేజీల్లో కూడా నమోదు అవుతున్నాయి. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా కరోనా బారిన పడుతున్నారు. దీంతో కరోనా కేసులు నమోదు అయిన స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులు, టీచర్లు ఆందోళన చెందుతున్నారు. అన్ని జిల్లాలో స్కూల్స్, కాలేజీల్లో నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులతో పాటు టీచర్లు కూడా […]
నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. చంద్రబాబు నాయుడు కి సంబంధించిన ఫేస్ బుక్ ఖాతా జయహో చంద్రబాబు అనే పేరుతో ఉందని , ఆ ఖాతా నుంచి సోషల్ మీడియాలో దళిత ఎమ్యెల్యేలు అయిన తన ఫోటో, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ , సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంల ఫోటోలు పెట్టి, కింద భాగంలో మంత్రులు పెద్ది రెడ్డి […]
దేశంలో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రతీరోజూ వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చాలా మందికి కృత్రిమ ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ వృథాను అరికట్టడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఆసుపత్రుల్లో అవసరాన్ని బట్టి ఆక్సిజన్ వినియోగించాలని సూచించింది. ప్రస్తుతం సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఎవరూ ముందస్తుగా నిల్వలు చేయకూడదని […]