Sharwanand : అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న తాజా మూవీ ఓదెల-2. రీసెంట్ టైమ్ లో భారీ హైప్ క్రియేట్ సినిమా ఇది. తమన్నా ఇందులో శివశక్తి పాత్ర చేస్తోంది. సంపత్ నంది, మధు నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా శర్వానంద్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓదెల-2 ట్రైలర్ చూశాను. వెంటనే సంపత్ నందికి ఫోన్ చేసి.. ఇది మరో అరుంధతి, అమ్మోరు సినిమాలా అనిపిస్తోంది అంటూ చెప్పాను. ఈ సినిమా వైబ్రేషన్స్ చూస్తుంటే కచ్చితంగా ఏదో మ్యాజిక్ జరగబోతోంది అనిపిస్తోంది. ఇలాంటి సినిమాల కోసం జనాలు వెయిట్ చేస్తుంటారు’ అంటూ తెలిపాడు.
Read Also : Ranga Reddy: మరికొన్ని రోజుల్లో మేనమామ పెళ్లి.. చిన్నారులను వెంటాడిన విధి
‘కొన్ని సినిమాలకు స్పెషల్ ప్లాన్ చేయక్కర్లేదు. ఆటోమేటిక్ గా వచ్చి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి. ఈ ఓదెల-2 సినిమా కూడా అంతే. ఈ సినిమా కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ఇంట్రెస్టింగ్ పెరుగుతోంది. తమన్నా అద్భుతంగా నటించింది. ఆమె లాంటి గ్లామర్ హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయడం నిజంగా ఒక ఛాలెంజ్. మా ఇంట్లో కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సంపత్ నందితో నాకు మంచి అనుబంధం ఉంది. మేమిద్దరం కలిసి సినిమా చేస్తున్నాం. ఆయన వర్క్ డెడికేషన్ నాకు తెలుసు. ఈ సినిమాలో అది కచ్చితంగా కనిపిస్తోంది. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’ అంటూ తెలిపాడు శర్వానంద్.