గ్రామస్తులు వోటింగ్ బహిష్కరణ.. ఎమ్మెల్యే బియ్యపు కీలక వ్యాఖ్యలు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉపఎన్నికలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రెండు చోట్ల గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించారు. మాజీ మంత్రి బొజ్జల స్వగ్రామం ఊరందూరుతో పాటు నారాయణ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో తమ గ్రామాలను విలీనం ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు గ్రామస్థులు. గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించడంతో ఒక్క ఓటరూ రాక బోసిపోయింది ఊరందూరు పోలింగ్ స్టేషన్. ఇప్పటికీ ఒక్క ఓటు కూడా పోల్ అవ్వని పరిస్థితి నెలకొంది. ఓటింగ్ బహిష్కరించడమే గాక..తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో కలపడంపై నిరసన తెలిపారు. మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని కలపబోమని రాతపూర్వక హామీ కోరుతున్నారు గ్రామస్థులు. అయితే ఈ అంశం మీద ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థి నచ్చకపోతే నోటా కి ఓటు వేసుకో వచ్చు…కానీ వోటింగ్ కి రాకుండా ఉండడం తగదని హితవు పలికారు స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో ఊరందూరును శ్రీకాళహస్తి లో కలిపారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయం కాదని అన్నారు. గ్రామస్థులు తీసుకున్న నిర్ణయంలో బొజ్జల కుటుంబం చేస్తున్న రాజకీయం కనిపిస్తుందని ఆరోపించారు ఎమ్మెల్యే.
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..