Nani : నేచురల్ స్టార్ నాని అంటే ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆయన నుంచి వచ్చే సినిమాలు చాలా క్లాసిక్ గా ఉంటాయనే నమ్మకం అందరికీ ఉంది. పైగా ఆయన సినిమాలు అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ ఉంది. అలాంటి నాని ఇప్పుడు సీరియస్ కథలతోనే సినిమాలు చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. హాయ్ నాన్ని సినిమా తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమాలు దీన్ని ప్రూవ్ చేస్తున్నాయి. ప్రస్తుతం హిట్-3 సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ టైమ్ నాని ఇందులో వైలెంటిక్ పాత్రలో నటిస్తున్నాడు. అత్యంత సీరియస్ పాత్రను పోషిస్తున్నాడు.
Read Also : Koratala Shiva : కొరటాల శివ దారెటు..?
ఇందులో తనను చూసి క్లాసిక్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావొద్దని నాని స్వయంగా చెబుతున్నాడు. దీని తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ సినిమా లైన్ లో ఉంది. ఆ మూవీలో మరింత రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు నాని. అది అత్యంత సీరియస్ పాత్ర అని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇవి గనక పెద్ద హిట్ అయితే.. తర్వాత నాని ఇలాంటి జానర్ లోనే సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించొచ్చు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా డిఫరెంట్ గా ఉండే సినిమాలకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
రొటీన్ లవ్ స్టోరీ సినిమాలు వారికి బోర్ కొట్టేస్తున్నాయి. అందుకే కథ, కథనం, లుక్ అన్నీ డిఫరెంట్ గా ఉండాలని కోరుకుంటున్నారు. నాని కూడా ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీ సినిమాలు చేశాడు. కాబట్టి ఇక నుంచి ప్రేక్షకులు కోరుకునే కొత్తదనం బాటలోనే నడవాలని భావిస్తున్నాడంట.