ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో కరోనా సెకండ్ వేవ్ భయం నెలకొంది. ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న వి.పద్మా రావు కరోనాతో మృతి చెందారు. శుక్రవారం సచివాలయంలో 200 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇంకా ఆ ఫలితాలు రావలసి ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. కోవిడ్ భయంతో సచివాలయానికి ఉన్నతాధికారులు దూరంగా ఉంటున్నారు. విజయవాడలోని వివిధ హెచ్ఓడి కార్యాలయాల నుంచి వివిధ శాఖ ఉన్నతాధికారులు విధులు నిర్వహిస్తున్నారు.