దేవుళ్ళకు కూడా కరోనా ఎఫెక్ట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ఆలయాలను మూసేస్తున్నారు నిర్వాహకులు. ఇప్పటికే ప్రధాన ఆలయాల్లో దర్శనాలు నిలిపివేశారు . తాజాగా చిన్న చిన్న గుడులకు సైతం తాళం వేస్తున్నారు. హైదరాబాద్ లోని సైదాబాద్ ఇంద్రప్రస్తా కాలనీలోని అభయాంజనేయస్వామి దేవాలయాన్ని మూసివేశారు. గుడి బయట నుంచే దండం పెట్టుకొని వెళ్లిపోతున్నారు భక్తులు. ఇక శ్రీరామనవమి వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత కొనసాగుతోంది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆలయాలపై కరోనా ఎఫెక్ట్. పురాతన ఆలయాలన్నీ మూసివేయాలని కేంద్ర ఆర్కెలాజికల్ అధికారులు ఆదేశించారు. దీంతో బుగ్గ రామలింగేశ్వర ఆలయం, చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు … దేవాలయాలు మూసే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి భక్తుడు కోవిడ్ నిబంధనలు పాటించి… ఇంటి దగ్గర పూజలు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కరోనా విజృంభిస్తున్నందున అనంతపురం జిల్లా లేపాక్షి లో ప్రసిద్ధి పుణ్య క్షేత్రం శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి దేవాలయాన్ని ఈరోజు ఉదయం నుంచి మూసివేశారు. వచ్చే భక్తులకు దర్శనం కూడా నిలిపివేశారు దేవాలయంలోకి ప్రవేశించకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. లేపాక్షి ప్రధాన ఆలయం తో పాటు నంది విగ్రహం కూడా అధికారులు మూసివేశారు. గర్భగుడిలో పూజలు కొనసాగిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది
Also Read
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
- OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
- Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
తాజావార్తలు
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
-
Shabad M*urder Case: రాత్రి 11 నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు కొనసాగిన హత్యలు.. ముందుగా మైనర్ బాలికను తీసుకెళ్లి..
-
Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్.. పార్ట్ 3పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదు’
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
Roshan Kanakala: ప్రేమ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్.. రోషన్ కనకాల కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!