Tamannaah :తమన్నా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓదెల-2. అశోక్ తేజ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సంపత్ నంది, డి.మధు నిర్మిస్తున్నారు. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ టీమ్ పాల్గొంది. ఇందులో తమన్నా మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను. ఎన్నో నిర్మాణ సంస్థలతో పనిచేశాను. కానీ స్పెషల్ బాండింగ్ మాత్రం కొందరితోనే ఏర్పడుతుంది. అలా నాకు సంపత్ నంది గారితో ఏర్పడింది. ఆయన నాతో ఇప్పటికి నాలుగు సినిమాలు చేశారు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ తెలిపింది.
Read Also : Nani : ఇక సీరియస్ సినిమాల్లోనే నాని..!
‘ఈ సినిమా మా కోసం కాకపోయినా సంపత్ నంది, మధు గారి కోసం కచ్చితంగా ఆడాలని కోరుకుంటున్నాను. వారికి పెద్ద హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నాను. నన్ను శివశక్తి పాత్రలో సంపత్ నంది గారు ఊహించుకుని ఈ పాత్ర రాశారు. ఆయనకు స్పెషల్ థాంక్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు వేరు. ఇది వేరు. ఇది నాకు చాలా స్పెషల్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఇందులో వశిష్ట సింహా నటనను చూడటానికి వెయిట్ చేస్తున్నాను. ఆయన పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శర్వానంద్ కూడా గెస్ట్ గా వచ్చాడు.