ఏపీలో ఒక వైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్న క్రమంలో కరోనా వైద్యంలో కీలకమైన రెమిడెసివర్ ఇంజెక్షన్ మాత్రం దొరకడం లేదు. కరోనా వచ్చిన రోగులకు చేసే వైద్యంలో రెమిడెసివర్ మాత్రమే ఏకైక ఇంజెక్షన్ కావడంతో దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ ఇంజెక్షన్ కు డిమాండ్ కూడా తీవ్రంగా ఉంది. అయితే డిమాండ్ కు సరిపడా సరఫరా జరగని పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్ లో […]
కరోనా సెకండ్ వేవ్ మరోసారి గతంలో నెలకొన్న పరిస్థితులను గుర్తు చేస్తోంది. కరోనా వైరస్ భయంతో గతంలో చాలామంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సోకిందన్న భయంతో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన షేక్ విలాయత్ అనే యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను గుంటూరు స్పిన్నింగ్ మిల్ […]
విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో హత్యకు గురైన ఆరుగురి మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి కాలేదు. తన కుటుంబాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన అప్పల రాజుతో పాటు అతనికి సహకరించిన మరో ఆరుగురిని అదుపులోకి తీసుకుంటేనే పోస్ట్‌మార్టానికి అంగీకరిస్తామని అంటున్నాడు బాధితుడు విజయ్, అతని బంధువులు. బత్తిన అప్పలరాజుతోపాటు దుర్గాప్రసాద్, గౌరీష్, శ్రీనులను కూడా శి్‌క్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విశాఖ మార్చురీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జుత్తాడ శెట్టిబలిజ వీధికి చెందిన బత్తిన అప్పలరాజుకు, […]
అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విశ్వ హిందూ పరిషత్ సేకరించిన 15 వేల చెక్కులు బౌన్స్ అయ్యాయి. చెక్కుల విలువ సుమారు 22 కోట్లుగా ఉంటుందని మందిర ట్రస్ట్ తెలిపింది. బ్యాంకు ఖాతాల్లో సరిపడా నిధులు లేకపోవడం,సాంకేతిక సమస్యల కారణంగా చెక్కులు బౌన్స్ అయినట్లు వెల్లడించింది. సాంకేతిక లోపాలు సవరించేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయని ట్రస్ట్ సభ్యులు ఒకరు తెలిపారు.కాగా ఈ చెక్కుల్లో దాదాపు 2 వేల చెక్కులు అయోధ్య నుంచి వచ్చినట్లు చెప్పారు. జనవరి 15 […]
పెందుర్తి ఆరు హత్యల అంశంలో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అప్పలరాజు పోలీసుల విచారణలో కీలక విషయం బయట పెట్టాడు. ఈరోజు వేకువజామున పాలు తీసుకోవడానికి వెళుతున్న అప్పలరాజును విజయ్ భార్య చూసి వెటకారంగా నవ్వినట్టు చెబుతున్నాడు. విజయ్ భార్యతో పాటు, విజయ్ తండ్రి బమ్మిడి రమణ కూడా అప్పలరాజు ను చూసి వెటకారంగా నవ్వడంతో అవమానంగా భావించిన అప్పలరాజు ఎదురుగా ఉన్న తన ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకు వచ్చి […]
విశాఖ మధురవాడ మిథిలా పూర్ కాలనీ లో ఉన్న ఆదిత్య టవర్స్ లో, ఈరోజు తెల్లవారుజామున బంగారు నాయుడు కుటుంబంలో నలుగురు కూడా మృతి చెందారు. పెద్ద కుమారుడు మినహా మిగతా అందరికీ వాటిపై గాయాలు ఉన్నాయి. అసలేం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మిథిలా పూర్ ఉడా కాలనీ ఆదిత్య టవర్స్ లో ఎనిమిది నెలల క్రితం, బంగారు నాయుడు కుటుంబం సి బ్లాక్ లో ఉన్న 505 […]
కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారింది కుంభమేళ. నిబంధనలు గాలికి వదిలేయడంతో వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయ్. కుంభమేళా జరిగిన ప్రదేశంలో ఏప్రిల్ 10 నుంచి 14 వరకు మొత్తంగా 2,36,751 శాంపిల్స్ పరీక్షించగా..1701మందికి పాజిటివ్‌గా తేలింది. భక్తులతో పాటు సాధువులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు అధికారులు. మరోవైపు కరోనా కేసులు పెరిగినా సరే మహాకుంభమేళా వాయిదా వేయడం కుదరని తేల్చి చెప్పింది ఉత్తరాఖండ్ సర్కార్. ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని అధికారులు […]
ఎపి ముఖ్యమంత్రి తల నరుకుతానంటూ వ్యాఖ్యానించిన సస్పెండెడ్ మేజిస్ట్రీట్ రామకృష్ణను మదనపల్లిలో పోలీసు అరెస్టు చేసి, పీలేరు తీసుకువెళ్లారు. అధికారిక ప్రకటన ఇంకా లేనప్పటికీ ఆ వ్యాఖ్యల కోసమే అరెస్టు చేసి ఉంటారని భావిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును నడిరోడ్డుమీద కాల్చాలని జగన్ అనలేదా అని ఈ సమయంలో రామకృష్ణ వ్యాఖ్యానించారు. అయితే ఆ సమయంలోనూ జగన్ ను అందరూ ఖండిరచారనేది తెలిసిన విషయమే. ఆయన కూడా తన వ్యాఖ్యలను కొంచెం […]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎల్లుండి జరిగే పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్ నిబంధనల మధ్య పోలింగ్ నిర్వహించనున్నారు. పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం క్లోజయింది. మైకులన్నీ మూగబోయాయి. బయటి వ్యక్తులు ఎవరు నియోజకవర్గంలో ఉండొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. డబ్బు పంపిణీ జరుగుతోందంటూ పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఏప్రిల్ 17న జరిగే సాగర్ ఉపఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు […]
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న జరగాల్సిన నీట్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించింది. కరోనా కేసులు శరవేగంగా వ్యాపిస్తున్న వేళ ఆఫ్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించవద్దని ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ లు కూడా దాఖలు అయ్యాయి. అయితే సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ఈ పరీక్షలను […]