రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎంలు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ ప్లవ నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషాలతో కళకళలాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి […]
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వాలంటీర్లకు క్లాస్ పీకారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వాలంటీర్లను సన్మానించిన ధర్మాన … పనిలో పనిగా తన మనసులో ఉన్న ఆవేదనను వెళ్లగక్కారు. మాకు జగన్ ఉద్యోగాలిచ్చారు … మీరేంటి మధ్యలో అనేలా వాలంటీర్లు వ్యవహరించడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్సార్ ప్రభుత్వం మనందరిదీ…మన నాయకుడు వైఎస్ […]
దేశంలో మూడో టీకా కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్పుత్నిక్ టీకాకు ఆమోదం కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో అందుబాటులోకి రానుంది రష్యా వ్యాక్సిన్. దేశంలో టీకా కొరత వేధిస్తోంది. దీంతో స్ఫుత్నిక్‌కు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతుండటం, వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన చేసిన ‘స్పుత్నిక్-వి’ వ్యాక్సిన్ […]
భారతదేశ పరిపాలన వ్యవస్థలో వాలంటీర్ల వ్యవస్థ సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా రాజాంలో వాలంటీర్లకు సేవ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి పాల్గొన్నారు. దేశంలోనే వాలంటీర్ వ్యవస్థ ఎంతో అద్భుతమైనదని..కానీ కొందరు వాలంటీర్లకు రాజకీయాలు అంటగడగుతున్నారని మండిపడ్డారు. ఎవరేమనుకున్నా వాలంటీర్లు పట్టించుకోనవసరం లేదని..వాలంటీర్లకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజల్లో అసంతృప్తి ఒక్క శాతం కూడా ఉండటానికి వీల్లేదు …గో ఎహెడ్ అంటూ […]
హైదరాబాద్‌లో చీటర్‌కు బుద్ధి చెప్పిందో మహిళ. హైదరాబాద్ గౌతమీనగర్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ బాలానగర్ కార్పొరేటర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఓ వివాహితకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె దగ్గర 10 లక్షలు వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇల్లు రాకపోవడంతో ఆమె… నిందితుడిని నిలదీసింది. తన డబ్బులు ఇచ్చేయాలని కోరింది. డబ్బులు ఇవ్వనని.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నాడు. అంతేకాదు మళ్లీ డబ్బులు అడిగితే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో […]
పక్కా ప్లాన్‌తో భార్యను హత్య చేశాడు భర్త. హత్యను మిస్ ఫైర్‌గా చిత్రీకరించబోయే అడ్డంగా దొరికిపోయాడు. బెజవాడ మిస్ ఫైర్ ఘటనలో అసలు నిజాలు బయటకు వచ్చాయి. భార్య రత్న ప్రభను హోంగార్డ్ వినోద్ ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపాడని పోలీసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినోద్, రత్న ప్రభ కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ ఘర్షణ సమయంలో వినోద్ […]
నాగార్జున సాగర్‌లో ఏర్పాటుచేయనున్న సీఎం సభను రద్దు చెయాలని యుగ తులసి ఫౌండేషన్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతుండడంతో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని ప్రభుత్వం జీవో నెంబర్ 69 విడుదల చేసిందని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అందుకే ఏప్రిల్ 14 న సీఎం కేసీఆర్ తలపెట్టిన సభను రద్దు చేయాలని కోర్టును కోరాడు పిటీషనర్ శివకుమార్. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సభను రద్దు చేయాలని కోరారు. ఈనెల […]
బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నాయకులు నుంచి చిన్న కార్యకర్త వరకు అందరూ టీడీపీలో అందరూ జూనియర్ ఎన్టీఆర్ రావాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. తండ్రి గా చంద్రబాబు విఫలమయ్యారు…కొడుక్కి రాజకీయాలే కాదు కనీసం సంస్కారం కూడా నేర్పించలేకపోయారని అన్నారు. బీజేపీ మత విద్వేషాలను ఎజెండాగా తీసుకుని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఏం చేశారని తిరుపతి ఓటర్లు మీకు ఓటెయ్యాలి? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ స్వార్ధాన్ని కూడా పక్కన పెట్టి జగన్ […]