టీఆర్ఎస్కు పట్టున్న నియోజకవర్గాల్లో దుబ్బాక ఒకటి. గులాబీ పార్టీ నుంచి సోలిపేట రామలింగారెడ్డి వరసగా విజయం సాధిస్తూ వచ్చారు. అంతకుముందు ఈ నియోజకవర్గం దొమ్మాటగా ఉండేది. అప్పుడు కూడా సోలిపేట రెండుసార్లు గెలిచారు. గత ఏడాది సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున రామలింగారెడ్డి భార్య సుజాత పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఓటమితో సుజాత కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు. కానీ.. ఇప్పుడిప్పుడే ఆమె యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో […]
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏకైక మంత్రిగా చెలామణి అయిన అవంతి శ్రీనివాస్‌కు పదవీ వియోగం ఏ మాత్రం మింగుడు పడ్డం లేదు. గ్రూప్ రాజకీయాలు, అవినీతి అంటే తనకు తెలియదని.. పార్టీకి విధేయుడిగా ఉన్నా పక్కనబెట్టారని ఆవేదన చెందుతున్నారట. మంత్రి హోదా కోల్పోయిన తర్వాత భీమిలి నియోజకవర్గానికే పరిమితం కావాల్సి వస్తుందనే ఆలోచన కంటే.. అన్ని విధాలుగా జూనియరైన గుడివాడ అమర్నాథ్కు అవకాశం లభించడం మాజీమంత్రి జీర్ణించుకోలేకపోతున్నట్టు పార్టీ వర్గాల భోగట్టా. ఈ అసంతృప్తిని కొత్త మంత్రికి […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 48 డివిజన్లు గెల్చుకుంది. GHMC ఎన్నికల ద్వారా సిటీలో కాషాయం పార్టీకి సానుకూల వాతావరణం వచ్చిందన్నది కమలనాథుల అభిప్రాయం. అయితే ఎన్నికలు అయ్యి దాదాపు 15 నెలలు కావస్తోంది. రోజులు గడిచిపోతున్నాయి కానీ.. GHMCలో బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరో పార్టీ తేల్చలేదు. పార్టీ పరంగా కార్పొరేటర్లకు ఇచ్చే పదవులపైనా ఉలుకు.. పలుకు లేదు. ఈ పదవుల కోసమే కొందరు కాచుకుని ఉన్నారు. GHMCలో బీజేపీలో ఫ్లోర్ లీడర్ […]
మంత్రివర్గంలో బెర్త్ మొదటిసారి తృటిలో తప్పినా.. రెండోసారి మాత్రం ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ.. ఆ ఆనందం మాత్రం మిగలడం లేదు. మంత్రిగా జిల్లాలో అడుగు పెట్టకముందే.. ఒకవైపు సొంత పార్టీ నాయకుల నుంచి.. మరోవైపు పాత కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన వచ్చిన కష్టాలేంటి? ఆదిలోనే హంసపాదుగా మారిన విషయాలేంటి? కాకాణి గోవర్దన్‌రెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు […]
సుధీర్ఘ చర్చల తర్వాత జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసింది అధికార టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమ సమయంలో మాత్రమే పార్టీకి జిల్లా అధ్యక్షులు ఉండేవారు. ఆ తర్వాత ఈ పదవుల జోలికి వెళ్లలేదు అధిష్ఠానం. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేనే సుప్రీం అని గులాబీ పార్టీ స్పష్టం చేసింది. కానీ.. కొద్ది నెలల క్రితం రాష్ట్రంలోని 33 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది టీఆర్ఎస్. వీరిలో ఎక్కువగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. నియామక ప్రక్రియ […]
పొలిటికల్ అటెన్షన్ కోసం బీజేపీ ఆపసోపాలు ఏపీలో బలపడేందుకు నానా తంటాలు పడుతోంది బీజేపీ. వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా మారాలని ఎన్నెన్నో ప్రణాళికలు వేస్తోంది. కానీ.. అవేమీ వర్కవుట్ కావడం లేదు. రెండు మూడు రోజులకే వేడి చల్లారిపోతోంది. తర్వాత వాటి గురించి.. బీజేపీ గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి ఉండటం లేదు. దీంతో ప్రజల్లో పొలిటికల్ అటెన్షన్ తీసుకొచ్చేందుకు ఏం చేయాలో కమలనాథులకు పాలుపోవడం లేదట. ప్లాన్స్ వర్కవుట్ కావడం లేదా? ప్రస్తుతం […]
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే. పార్టీలో ఉన్నారో లేదో తెలియని సమయంలో.. బయటకు వెళ్లిపోతారని చర్చ జరుగుతున్న వేళ పార్టీలో చర్చగా మారారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన అంటీముట్టనట్టు వ్యవహారం నడుపుతున్నారనే టాక్ ఉంది. సడెన్‌గా హస్తినకు వెళ్లి.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత్రితో భేటీ ఒక రహస్యమైతే.. ఇద్దరిపై ఫిర్యాదు చేశారన్న సమాచారం కాంగ్రెస్ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ఠాగూర్, రేవంత్‌ల […]
మర్మం లేకుండా మాట్లాడేస్తారు. మెలితిప్పే కామెంట్స్ అస్సలు ఉండవు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. ఇన్నాళ్లూ ఆయన ఏం చెప్పినా చర్చే. ఇప్పుడు మాత్రం ఆయన మంత్రి. అభినందన సభలోనే నర్మగర్భ వ్యాఖ్యలతో కలకలం రేపారు. కాకపోతే ఆ ధర్మ సూక్తులు ఎవరికన్నదే ప్రస్తుతం ప్రశ్న. హాట్ టాపిక్‌గా మంత్రి ధర్మాన కామెంట్స్ ధర్మాన ప్రసాదరావు. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత మంత్రి హోదాలో జిల్లాకు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం […]
మంత్రి గారూ…ఏమిటిది అని ప్రశ్నిస్తున్నారు..ఇంతకంటే పెద్దఘటనేం కావాలి.. స్పందించటానికైనా, పరామర్శించటానికైనా… అంటున్నారు..సంబంధం ఉన్నవారు లేని వారిలో కూడా కదలిక వచ్చింది కానీ, స్వయంగా ఆ శాఖ మంత్రి మాత్రం సైలెంట్ గా ఉన్నారనే విమర్శలు పెరుగుతున్నాయట. పోరస్ కంపెనీ అగ్ని ప్రమాదం తో రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడింది. నాటి ఎల్జీ పాలిమర్స్ సంఘటనను గుర్తుకు తెచ్చేలా అగ్ని ప్రమాదం జరగడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనిపై అధికార యంత్రాంగం.. ప్రభుత్వంలోని పెద్దలు వెంటనే స్పందించారు. చాలా […]
ఇప్పటికే చాలా జండాలు మారాయి..చాలా కండువాలు కప్పారు.. తీసేశారు..కొంత కాలంగా ఇవన్నీ కాదని సైలెంట్ గా ఉన్నారు.. అయితే ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ గాలి కింద సేదదీరుదామనుకుంటున్నారట..హస్తం, సైకిల్, కమలం.. ఇవన్నీ దాటుకుని వచ్చిన ఆయన వైసీపీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట.. మళ్లీ వైసీపీకి దగ్గరవుతున్నారా?అధికార పార్టీకి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతున్నారా? కీలక నేత దారెటు? సి కే జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబు.చిత్తూరు జిల్లా సీనియర్ రాజకీయనాయకుల్లో ఒకరైన సికె బాబు, నాలుగు సార్లు […]