ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. ఈ సినిమా గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోందని, బిత్తిరి సత్తి, అజయ్ గోష్ తో పాటు హీరో, హీరోయిన్లు ఇతర నటీనటులపై కీలకమైన సన్నివేశాలను గోవా షెడ్యూల్ లో చిత్రీకరించామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. […]
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అంటే టక్కున వినపడే పేర్లు రశ్మిక, పూజా హేగ్డే. అయితే ఈ మధ్య కాలంలో పూజా వరుస పరాజయాలను ఫేస్ చేస్తూ వస్తోంది. తాజాగా ఏకంగా ప్లాఫ్ లలో హ్యాట్రిక్ సైతం కొట్టేసింది. అమ్మడి హ్యాట్రిక్ కి ‘ఆచార్య’ బ్రేక వేస్తుందని అందరూ ఆశించినా అది నెరవేరలేదు. ఈ మెగా మల్టీస్టారర్ సైతం పూజకు హ్యాండిచ్చింది. దీంతో పూజ హ్యాట్రిక్ ప్లాఫ్ లను ఎదుర్కొవలసి వచ్చింది. ఒక్కో సినిమాకు మూడు […]
బాలీవుడ్ ప్రేమాయణాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకున్నా, యావద్భారతంలోని సినీ ఫ్యాన్స్ కు భలే ఆసక్తి! ఈ మధ్య కాలంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమ సొదలే ముంబైలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇంతకూ ఈ జంట ఎప్పుడు పెళ్ళి పీటలెక్కుతుందీ అనీ అందరూ ఎదురుచూస్తున్నారు. ఇరువైపుల పెద్దల అంగీకారంతోనే అలియా, రణబీర్ ఒక్కటి కాబోతున్నారు. ఆ మాటకొస్తే వారిద్దరికీ ఎప్పుడో పెళ్ళయిందనీ, ఇప్పుడు అధికారికంగా జనానికి తెలిసేలా పెళ్ళి చేసుకోనున్నారని బాలీవుడ్ బాబులు చెబుతున్నారు. ఏప్రిల్ […]
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’ అనుకోని ఫలితాన్ని అందించలేకపోయింది. దీనికి ముందు వచ్చిన ‘సాహో’ సైతం పాక్షిక విజయాన్నే అందుకుంది. దాంతో ప్రభాస్ మానసిక ప్రశాంతత కోసం స్పెయిన్ కు వెళ్ళాడనే వార్తలు రెండు మూడు వారాల క్రితం వచ్చాయి. అయితే అక్కడ ప్రభాస్ తన మోకాలికి చిన్నపాటి ఆపరేషన్ చేయించుకున్నాడనీ కొన్ని రూమర్స్ వెలువడ్డాయి. కానీ ప్రభాస్ సన్నిహితులు ఎవరూ దీనిపై పెదవి విప్పలేదు. ఇదిలా ఉండగా, ‘రాధేశ్యామ్’ విడుదల […]
ఈ సారి జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్యంగా విల్ స్మిత్, వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై చేయిచేసుకోవడం పెద్ద దుమారం రేపింది. విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్ బోడిగుండుపై రాక్ సరదాగా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన స్మిత్ అతనిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అకాడమీ క్రమశిక్షణ కమిటీ ఇటీవల సమావేశమయింది. ఆ కమిటీ నిర్ణయం రాకమునుపే విల్ స్మిత్ తాను అకాడమీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. దానిని అకాడమీ సైతం […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ మూవీ ఈ నెల 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ‘బీస్ట్’ను తొలిసారి భారతదేశంలో ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (పీఎల్ఎఫ్) థియేటర్లలో ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయి. ఐమాక్స్ బిగ్ స్క్రీన్ తరహాలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘ప్రీమియం లార్జ్ ఫార్మాట్’ ఆడిటోరియమ్స్ హవా సాగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా అనంతరం ఇలాంటి పెద్ద […]
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ రేపు ఉగాది రోజున గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. మేకర్స్ ప్రకటించినట్లుగా, పండుగ సందర్భంగా సినిమా ప్రీ-లుక్ కూడా విడుదల కాబోతోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తుండగా, ఇందులో మరో నటి కనిపించనుంది. ప్రముఖ మోడల్ గాయత్రీ […]
డెబ్యూ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దాంతో సహజంగానే అతని సెకండ్ ఫిల్మ్ ‘మిషన్ ఇంపాజిబుల్’పై అంచనాలు పెరిగిపోయాయి. జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీతో పాటు రవీంద్ర విజయ్, హరీశ్ పేరడి, విషబ్ శెట్టి లాంటి పరభాషా నటులూ ఈ ప్రాజెక్ట్ తో జత కావడంవల్ల సమ్ థింగ్ స్పెషల్ గా ‘మిషన్ ఇంపాజిబుల్’ ఉండబోతోందనే ఆశలు ఏర్పడ్డాయి. కానీ దర్శకుడు స్వరూప్ ద్వితీయ […]
వైష్ణవ్ తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రంగరంగ వైభవంగా!’. తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకున్న వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మూడో చిత్రమిది. బాపినీడు బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్. ఈ చిత్రాన్ని మే 27న విడుదల చేయబోతున్నట్టు నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా […]
యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన థ్రిల్లర్ మూవీ Black రిలీజ్ డేట్ ఖరారయ్యింది. మహంకాళి మూవీస్ పతాకంపై ఆది సాయి కుమార్ హీరోగా జీబి కృష్ణ దర్శకత్వంలో మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం “బ్లాక్”. ‘ఆటగాళ్లు’ ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల అయిన “బ్లాక్” టీజర్ కి […]