Mishan Impossible Review: మిషన్ ఇంపాజిబుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డెబ్యూ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దాంతో సహజంగానే అతని సెకండ్ ఫిల్మ్ ‘మిషన్ ఇంపాజిబుల్’పై అంచనాలు పెరిగిపోయాయి. జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీతో పాటు రవీంద్ర విజయ్, హరీశ్ పేరడి, విషబ్ శెట్టి లాంటి పరభాషా నటులూ ఈ ప్రాజెక్ట్ తో జత కావడంవల్ల సమ్ థింగ్ స్పెషల్ గా ‘మిషన్ ఇంపాజిబుల్’ ఉండబోతోందనే ఆశలు ఏర్పడ్డాయి. కానీ దర్శకుడు స్వరూప్ ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయాడు.
శైలజ ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. చైల్డ్ ట్రాఫిక్ మీద దృష్టి పెట్టి దాన్ని అరికట్టడం కోసం కృషి చేస్తుంటుంది. ఆమెకు విక్రమ్, ఎస్.ఐ. సతీశ్ సహరిస్తుంటారు. రాజకీయ నాయకుల నుండి ఒకప్పుడు సాయం పొంది, ఆ తర్వాత తన నేర సామ్రాజ్యాన్ని విస్తరింప చేసి, తానే రాజకీయ నేతలకు సాయం చేసే స్థాయికి ఎదిగిన రామ్ శెట్టి చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చేస్తుంటాడు. ఈ విషయం శైలజ దృష్టిలో పడుతుంది. ఇదిలా ఉంటే… చిత్తూరు జిల్లాలోని వడమాల పేటకు చెందిన రఘుపతి, రాఘవ, రాజారాం అనే ముగ్గురు పిల్లలు ముంబై వెళ్ళి దావూద్ ఇబ్రహీంను పట్టుకుని ప్రైజ్ మనీ గా ప్రభుత్వం ఇచ్చే యాభై లక్షల రూపాయలను సొంతం చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు. అందులో రఘపతికి దర్శకుడు కావాలనే పిచ్చి. రాఘవకు కౌన్ బనేగా కరోడ్ పతి కి వెళ్ళాలనే కోరిక. ఇక మూడోవాడైన రాజారాంకు క్రికెటర్ కావాలని ఆశ. ఈ ముగ్గురూ ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్ళాలని బయలుదేరి బెంగళూరులో దిగుతారు. అక్కడ అనుకోకుండా వీరికి శైలజ తారసపడుతుంది. ఈ పిల్లల సాయంతో ఆమె రామ్ శెట్టి చైల్ట్ ట్రాఫికింగ్ వ్యవహారానికి ఎలా చెక్ పెట్టిందన్నదే మిగతా కథ.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాప్సీకి ఇప్పుడున్న ఇమేజ్ తో పోల్చితే, ఇది సరైన పాత్ర కాదు. సినిమా ప్రధమార్థంలో రెండు మూడు సీన్స్ లోనే ఆమె కనిపిస్తుంది. అలానే ద్వితీయార్థంలో ప్లానింగ్ ఆమెదే అయినా దాన్ని ఆచరణలో పెట్టేది పిల్లలు కావడంతో వాళ్ళదే డామినేషన్ అంతా. తాప్సీ లుక్ కాస్తంత డిఫరెంట్ గా ఉన్నా, ఆమె నుండి గొప్ప నటనను దర్శకుడు తీసుకోలేకపోయాడు. ఆమె కూడా చాలా బలహీనంగా కనిపించింది. ఇక ఆమె పక్కనే ఉండే విక్రమ్ పాత్రధారి రవీంద్ర విజయ్ తో సొంత డబ్బింగ్ చెప్పించడం మానిపిస్తే బాగుంటుంది. ఆ తమిళ యాసను భరించడం కష్టం! మలయాళ నటుడు హరీశ్ పేరడి గెటప్ ఆకట్టుకునేలా ఉంది. కానీ ఆయన నుండి కూడా గొప్ప నటన అయితే తీసుకోలేదు. ఒకటి రెండు సన్నివేశాల్లో హరీశ్ పేరడీ నటన కంటే కెమెరాలో డిఫరెంట్ యాంగిల్స్ లో అతని చూపించిన విధానమే ఆకట్టుకుంది. ముఖ్యంగా టాప్ యాంగిల్ షాట్స్! సుహాస్, హర్షవర్థన్, వైవా హర్ష, ‘సత్యం’ రాజేశ్, మధుసూదన్, సందీప్ రాజ్ వంటి వాళ్ళు గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చారు. కిశోర్ కుమార్ పొలిమేర, శరణ్య ప్రదీప్ తో మరికొందరు పిల్లల తల్లిదండ్రులుగా నటించారు. వీరందరి నటన బాగుంది. అయితే ముఖ్యంగా మెచ్చుకోవాల్సింది రఘుపతి, రాఘవ, రాజారాం పాత్రలు పోషించిన హర్ష రోషన్, భాను ప్రకాశన్, జయతీర్థ లను! ముగ్గురూ చాలా చలాకీగా నటించారు. వారిలోని అమాయకత్వం, ఏదైనా సాధించగలమనే తెగింపు, తప్పో ఒప్పో తెలియకపోయినా ప్రదర్శించే ధైర్యం ఇవన్నీ బాగా చూపించారు. అయితే… క్లయిమాక్స్ లో సైతం వారిని దావుద్ ను పోలీసులకు అప్పగించామనే భ్రమలో ఉంచేయడం సమంజసంగా లేదు!
తొలి చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’లో ఆర్గాన్ ట్రేడ్ ను ప్రధానాంశంగా తీసుకుని వినోదాత్మకంగా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు స్వరూప్. ఈ చిత్రంలో చైల్డ్ ట్రాఫికింగ్ ను ఎంపిక చేసుకున్నాడు. తీసుకున్న అంశం గొప్పదే అయినా దాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తడబడ్డాడు. పిల్లలతో కామెడీగా కథను నడపాలని చూసినా అది ఆకట్టుకోలేకపోయింది. ప్రధమార్థం కాస్తంత సరదాగా సాగినా ద్వితీయార్థంకు వచ్చే సరికీ మూవీ సీరియస్ టర్న్ తీసుకుంది. పిల్లలతో తాప్సీ కథ నడిపించడం పెద్దంత కన్వెన్సింగ్ గా లేకపోయింది. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ అధినేతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి రాజీపడకుండా సినిమాను నిర్మించారు. మార్క్ కె రాబిన్ స్వరాలు భిన్నంగా ఉన్నాయి. నేపథ్య సంగీతమూ బాగుంది. దీపక్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. మాటలూ వినోదాత్మకంగా ఉన్నాయి. అయితే కథ, కథనాలు మెప్పించే విధంగా లేకపోవడం ఈ చిత్రానికి సంబంధించి మెయిన్ మైనెస్!
రేటింగ్: 2.25/ 5
ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే పిల్లల నటన
ఎంపిక చేసుకున్న అంశం
నేపథ్య సంగీతం, సంభాషణలు
మైనెస్ పాయింట్స్
పేలవమైన కథనం
నిరాశ పరిచే క్లైమాక్స్
ట్యాగ్ లైన్: మిషన్ ఫెయిల్డ్!
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!