టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అంటే టక్కున వినపడే పేర్లు రశ్మిక, పూజా హేగ్డే. అయితే ఈ మధ్య కాలంలో పూజా వరుస పరాజయాలను ఫేస్ చేస్తూ వస్తోంది. తాజాగా ఏకంగా ప్లాఫ్ లలో హ్యాట్రిక్ సైతం కొట్టేసింది. అమ్మడి హ్యాట్రిక్ కి ‘ఆచార్య’ బ్రేక వేస్తుందని అందరూ ఆశించినా అది నెరవేరలేదు. ఈ మెగా మల్టీస్టారర్ సైతం పూజకు హ్యాండిచ్చింది. దీంతో పూజ హ్యాట్రిక్ ప్లాఫ్ లను ఎదుర్కొవలసి వచ్చింది. ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్న ఈ డస్కీ బ్యూటీకి ‘అల వైకుంఠపురములో’ తర్వాత హిట్ లేదు. అఖిల్ తో నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ జస్ట్ పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ప్రభాస్ తో కలసి నటించిన ‘రాధేశ్యామ్’ ఊహించని స్థాయి పరాజయాన్ని అందించింది. ఇత తమిళంలో రీఎంట్రీతో పాగా వేయాలనుకున్న ఇళయదళపతి సినిమా ‘బీస్ట్’ సైతం పూజ ఖాతాలో ఘోర పరాజయాన్ని నమోదు చేసింది. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’లో చరణ్ సరసన నటించింది పూజ. అయితే ఇందులో అమ్మడి పాత్ర నిడివి చిన్నది కావటంతో పాటు ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇక సినిమాకు కూడా బ్యాడ్ టాక్ రావటంతో పూజ ప్లాఫ్స్ లో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది. ప్రస్తుతం అమ్మడి చేతిలో ‘సర్కస్’ అనే హిందీ సినిమాతో పాటు త్రివిక్రమ్, మహేశ్ సినిమా మాత్రమే ఉన్నాయి. సెంటిమెంట్ కు ఎక్కువ విలువ ఇచ్చే టాలీవుడ్ లో ఇలా ప్లాఫ్ హీరోయిన్ ముద్ర పడితే మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావటం చాలా కష్టం. సో పారితోషికంకి ప్రాధాన్యం ఇవ్వకుండా మంచి పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ కెరీర్ ని ముందుకు తీసుకు వెళ్ళినపుడే పూజ మళ్ళీ సక్సెస్ బాట పడుతుంది. మరి ఆ దిశగా ప్రయత్నం చేస్తుందేమో చూద్దాం.