Ravi Teja: ‘టైగర్ నాగేశ్వరరావు’ మరో హీరోయిన్ ఎవరంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ రేపు ఉగాది రోజున గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. మేకర్స్ ప్రకటించినట్లుగా, పండుగ సందర్భంగా సినిమా ప్రీ-లుక్ కూడా విడుదల కాబోతోంది. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ ఈ సినిమాలో ఒక కథానాయికగా నటిస్తుండగా, ఇందులో మరో నటి కనిపించనుంది. ప్రముఖ మోడల్ గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. నూపూర్ కి లాగే గాయత్రీ భరద్వాజ్ కి కూడా ఇది మొదటి సినిమా. సినిమాలో ఇద్దరు హీరోయిన్ల కూ నటించేందుకు మంచి స్కోప్ ఉంటుందని దర్శకుడు వంశీ చెబుతున్నారు.
గాయత్రీ భరద్వాజ్ ఎఫ్బీబీ కలర్స్ ఫెమినా మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2018 గా ఎంపికైంది. ఆమె సెఫోరా మిస్ గ్లామరస్ లుక్, జియో మిస్ పాపులర్, కొడాక్ లెన్స్ మిస్ స్పెక్టాక్యులర్ ఐస్, మిస్ ఇండియా ఢిల్లీ 2018 మొదలైన టైటిల్స్ కూడా గెలుచుకుంది. వెబ్ సిరీస్ ‘దిండోరా’ లో నటనకు గానూ గాయత్రి ప్రశంసలు అందుకుంది.
స్టూవర్ట్ పురంలో పేరుమోసిన నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ రవితేజ చిత్రాల్లో కెల్లా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇదే రవితేజ తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!