ఐక్యూ క్రియేషన్స్ పతాకం పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాతగా దర్శకుడు శివ నాగేశ్వరావు తెరకెక్కిస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. ఈ సినిమా గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోందని, బిత్తిరి సత్తి, అజయ్ గోష్ తో పాటు హీరో, హీరోయిన్లు ఇతర నటీనటులపై కీలకమైన సన్నివేశాలను గోవా షెడ్యూల్ లో చిత్రీకరించామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే తమ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తయిందని, త్వరలో బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడతామంటున్నారు.