Will Smith : అకాడమీ నుండి తప్పుకున్న విల్ స్మిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ సారి జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్యంగా విల్ స్మిత్, వ్యాఖ్యాత క్రిస్ రాక్ పై చేయిచేసుకోవడం పెద్ద దుమారం రేపింది. విల్ స్మిత్ భార్య జడా పింకెట్ స్మిత్ బోడిగుండుపై రాక్ సరదాగా వ్యాఖ్యానించడంతో ఆగ్రహించిన స్మిత్ అతనిపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అకాడమీ క్రమశిక్షణ కమిటీ ఇటీవల సమావేశమయింది. ఆ కమిటీ నిర్ణయం రాకమునుపే విల్ స్మిత్ తాను అకాడమీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. దానిని అకాడమీ సైతం ఆమోదించింది.
ఈ సందర్భంగా స్మిత్ తన చర్యలను తానే ఖండించుకున్నారు. తాను అలా ప్రవర్తించి ఉండకూడదని, ఇది అకాడమీ నియమనిబంధనలకు, గౌరవానికి, హుందా తనానికి భంగం కలిగించినట్టేనని అంగీకరించారు. తన చర్య వల్ల ఎంతోమంది ఆస్కార్ విజేతలు ఆ వేడుకలో ఆనందం పంచుకోలేక పోయారని, వారికి ఇబ్బంది కలిగించినందుకు క్షమించమని వేడుకున్నారు. తన ప్రవర్తన కారణంగా అకాడమీ నమ్మకాన్ని వమ్ము చేశానని, అది తనకెంతో బాధ కలిగిస్తోందని ఇకపై ఇలాంటి చర్యలకు దూరంగా ఉంటాననీ విల్ పేర్కొన్నారు. చిత్రరంగంలోని సృజనకు, కళాత్మకతకు అకాడమీ పెద్ద పీట వేస్తోందని, తన కారణంగా గౌరవప్రదమైన అకాడమీకి ఏలాంటి ఇబ్బందులు కలగబోవని విల్ హామీ ఇచ్చారు.
Also Read
- Abbas: 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి అబ్బాస్ రీఎంట్రీ..?
- Nero Teaser Controversy: ప్రమోషన్ల కోసమా.. జనాల అటెన్షన్ కోసమా.. ఆ హీరో చేసింది కరెక్టేనా?
- Vrushakarma టైటిల్‌కు అసలు అర్థం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో చైతూ పాత్ర ఇదేనట!
- Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్‌కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
ఇదిలా ఉండగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హోస్ట్ గా వ్యవహరించిన క్రిస్ రాక్ ను అతనిపై జరిగిన దాడి విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటారా అని పోలీసులు అడిగారు. అందుకు రాక్ నిరాకరించడం గమనార్హం!
తాజావార్తలు
-
Mohammed Shami: షమీ పొలిటికల్ ఎంట్రీ?.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో షమీ భేటీ..
-
Abbas: 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి అబ్బాస్ రీఎంట్రీ..?
-
Nero Teaser Controversy: ప్రమోషన్ల కోసమా.. జనాల అటెన్షన్ కోసమా.. ఆ హీరో చేసింది కరెక్టేనా?
-
Vrushakarma టైటిల్‌కు అసలు అర్థం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో చైతూ పాత్ర ఇదేనట!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!