సంతోష్ శోభన్ నటించిన 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' మూవీ ఇటీవల విడుదలైంది. మరో మూడు సినిమాలు విడుదలకు సిద్థంగా ఉన్నాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికపై సంతోష్ శోభన్ ఎమోషనల్ పోస్ట్ ఒకటి పెట్టారు!
కార్తీక్ రాజు హీరోగా మరో కొత్త సినిమా మొదలైంది. త్వరిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీతో అంజీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
సాయి కుమార్ తనయుడు ఆది నటించిన చిత్రాలు ఈ యేడాది ఇప్పటికే నాలుగు జనం ముందుకు వచ్చాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో 'సి.ఎస్.ఐ. సనాతన్' రాబోతుండగా, 30వ తేదీ 'టాప్ గేర్' వస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అదే జరిగితే ఈ యేడాది ఆది నటించిన చిత్రాలు ఆరు విడుదలవుతున్నట్టు!
హీరో నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన 'మీట్ క్యూట్' ఆంథాలజీ త్వరలో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. నాని, ప్రశాంతి తిపుర్నేని నిర్మించిన 'మీట్ క్యూట్'లో సత్యరాజ్, రోహిణి కీలక పాత్రలు పోషించారు.
విష్ణువిశాల్ నటించి, నిర్మిస్తున్న 'మట్టి కుస్తీ' రిలీజ్ డేట్ ఖరారైంది. అడివి శేష్ 'హిట్ 2' విడుదల కాబోతున్న డిసెంబర్ 2వ తేదీనే 'మట్టి కుస్తీ' సైతం జనం ముందుకు వస్తోంది.
అక్కినేని నాగచైతన్య, కృతీశెట్టి జంటగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం తాజా షెడ్యూల్ మొదలైంది. ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా, ప్రస్తుతం యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు.
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'ఏజెంట్' సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పుడీ మూవీని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.