Vishnu Vishal: విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విష్ణు విశాల్ కు జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఇటీవల రవితేజ విడుదల చేయగా, తాజాగా కాజల్ అగర్వాల్ సెకండ్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో విష్ణు విశాల్ రెజ్లర్ గా కనిపించగా, సెకండ్ పోస్టర్ లో సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని చూపించారు. నూతన వధూవరుల దుస్తులలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మిలను రొమాంటిక్ కుస్తీలో ప్రజంట్ చేయడం ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ గా ప్రసన్న జికె పని చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.