ప్రముఖ రచయిత, కాలమిస్ట్ ఇలపావులూరి మురళీమోహన రావు ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. ఎనిమిది సినిమాలకూ రచన చేసిన ఆయన దాదాపు 200 కథలు, 750 వ్యాసాలు రాశారు.
ప్రశాంత్ వర్మ, తేజా సజ్జ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హను మాన్' టీజర్ విడుదలైంది. విజువల్ వండర్ గా ఉన్న ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సత్యదేవ్, డాలీ ధనుంజయ్ హీరోలుగా నటిస్తున్న క్రిమినల్ యాక్షన్ డ్రామాలో ఇప్పటికే ప్రియ భవానీ శంకర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. మరో కథానాయికగా ఇప్పుడు బ్రెజిలియన్ మోడల్ జెన్సీఫర్ ను బోర్డ్ లోకి ఆహ్వానిస్తున్నారు.
'మిన్నల్ మురళీ'తో మరోసారి తన సత్తాను చాటుకున్నాడు మలయాళ యువ కథానాయకుడు టొవినో థామస్. దాంతో అతను నటించిన 'ఒరు మెక్సికన్ అపరాథ'ను తెలుగులో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'గా డబ్ చేసి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'బేబీ'. ఎస్.కె.ఎన్. నిర్మించిన ఈ సినిమా టీజర్ ఈ నెల 21న విడుదల కాబోతోంది.
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ '18 పేజీస్' మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీనిలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.
సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి చిత్రలేఖ మామిడిశెట్టి నర్తించి, నిర్మించిన 'కృష్ణం వందే యశోదరం' మ్యూజిక్ ఆల్బమ్ ను మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఇటీవల వీక్షించి, ఆమెను అభినందించారు.