Priyamani: ఆ అమ్మడి చేతిలో మొన్న వంట గరిటే… నేడు రివాల్వర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyamani: ప్రముఖ కథానాయిక ప్రియమణి ఇప్పుడు రొటీన్ సినిమాలకు తిలోదకాలిచ్చేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై దృష్టి పెట్టింది. కథాబలం ఉండాలే కానీ ఓటీటీ సినిమాలకు సైతం సై అంటోంది. అలా ఆమె నటించిన థ్రిల్లర్ మూవీ ‘భామా కలాపం’ ఆ మధ్య ఆహాలో విడుదలై ప్రియమణికి చక్కని పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఆమె నటించిన ‘డాక్టర్ 56’ మూవీ డిసెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఇది మెడికల్ రిలేటెడ్ మూవీ అనే విషయం అర్థమైంది. అయితే అందులో ప్రియమణి స్టెతస్కోప్ కాకుండా రివాల్వర్ చేతిలోకి తీసుకున్న వైనం చూస్తుంటే… ఆమె పోలీస్ ఆఫీసర్ అనే విషయం తెలిసింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ సేతుపతి కూడా పాల్గొనే సరికీ అందరి దృష్టినీ ‘డాక్టర్ 56’ ఆకర్షించింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇండియాలో ఐదేళ్లలో 2163 మంది అంటూ సస్పెన్స్‌గా వదిలేశారు! మోషన్ పోస్టర్లో చూపించిన ఈ సంఖ్య, ప్రియమణి గన్నుపట్టుకున్న తీరు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా మూవీపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ‘డాక్టర్ 56’ మూవీని నిర్మించారు. ఇదే బ్యానర్ లో ప్రభుదేవా ‘ఫ్లాష్ బ్యాక్’, ‘వర ఐపీఎస్, ‘ఛేజింగ్’ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వీటినీ వీలైనంత త్వరగా విడుదల చేయబోతున్నారు. ‘డాక్టర్ 56’ మూవీకి కథ, కథనాలను ప్రవీణ్ అందిస్తుండగా రాజేష్ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ మీద ఈ సినిమాను ప్రవీణ్ రెడ్డి. టి తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. దీనికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూర్చగా, విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్‌గా, రాకేష్ సి తిలక్ కెమెరామెన్‌గా, విశ్వ ఎన్ ఎమ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. మాటలు భార్గవ్ రామ్ అందిస్తుండగా, పాటలకు సాహిత్యాన్ని చల్లా భాగ్యలక్ష్మీ , జె. లక్ష్మణ్ అందించారు. ఈ చిత్రంలో ప్రియమణితో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో ప్రవీణ్, దీపక్ రాజ్‌శెట్టి, రమేష్ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!