Vishnu Vishal: అడివి శేష్ తో విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో విష్ణు విశాల్ కు, మాస్ మహరాజా రవితేజకు మధ్య ఓ ప్రత్యేకానుబంధం ఉంది. ఆ మధ్య విష్ణు విశాల్ నటించి, నిర్మించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ తెలుగు వర్షన్ కు రవితేజ సమర్పకుడిగా వ్యవహరించాడు. అతని తాజా చిత్రం ‘మట్టి కుస్తీ’కి మాస్ మహరాజా ప్రెజెంటర్ గా ఉన్నాడు. విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటిస్తున్న ‘మట్టి కుస్తీ’ మూవీ ని చెల్లా అయ్యావు డైరెక్ట్ చేశారు. ఈ స్పోర్ట్స్ డ్రామా డిసెంబర్ 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. మూవీ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఫిరోషియస్ లుక్ లో ఐశ్వర్య కుర్చీపై కూర్చుని ఉండగా, విష్ణు విశాల్ ఆమె వెనుక నిలబడి ఉన్నాడు. ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్స్ ద్వారా మేకర్స్ సినిమాలోని యాక్షన్, రొమాంటిక్ సైడ్స్ చూపించారు. రిలీజ్ డేట్ పోస్టర్ సినిమాలో స్త్రీ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న ‘మట్టి కుస్తీ’లో విష్ణు విశాల్ రెజ్లర్ గా నటిస్తున్నాడు. దీనికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రాఫర్ గా, ప్రసన్న జికె ఎడిటర్ గా పని చేస్తున్నారు. విశేషం ఏమంటే… ఈ సినిమా విడుదల కాబోతున్న డిసెంబర్ 2వ తేదీనే అడివి శేష్ నటించిన ‘హిట్ 2’ మూవీ కూడా రిలీజ్ అవుతోంది. ప్రశాంతి త్రిపుర్నేని నిర్మిస్తున్న ‘హిట్ -2’ సినిమాకు నేచురల్ స్టార్ నాని ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. మరి డిసెంబర్ 2వ తేదీ బరిలోకి దిగుతున్న యువ కథానాయకులు అడివి శేష్, విష్ణు విశాల్ లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి!
Also Read
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!