సూపర్ స్టార్ కృష్ణ మృతికి హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాసు తీవ్ర సంతాపాన్ని తెలియచేశారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ కోల్ కతాలో జరుగుతోంది. అక్కడే కృష్ణ చిత్రపటానికి వీరు నివాళులు అర్పించారు.
ఈవారం తెలుగులో ఆరు స్ట్రయిట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. 'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన 'మసూద' కూడా ఇందులో ఒకటి కావడం విశేషం.
Samantha: శుక్రవారం విడుదలైన సమంత ‘యశోద’ చిత్రానికి అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథను, ఆసక్తికరంగా తెరపై చూపించారని దర్శకులు హరి, హరీశ్ లను అందరూ ప్రశంసిస్తున్నారు. సమంత అయితే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేశ్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ సైతం తమ మనసులోని భావాలను […]
బెల్లంకొండ గణేశ్ నటించిన రెండో సినిమా 'నేను స్టూడెంట్ సర్'! రాఖీ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'నాంది' సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాతో భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దుస్సాని టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ టీజర్ ను వివి వినాయక్ శనివారం విడుదల చేశారు.
ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ జంటగా నటించిన సినిమా 'శాసనసభ'. పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఈ చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ రవి బసురు సంగీతాన్ని అందించారు.
నాని సోదరి దీప్తి గంటా రూపొందించిన 'మీట్ క్యూట్' ఆంథాలజీ టీజర్ విడుదలైంది. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ ఆంధాలజీని సోనీ లైవ్ ప్రసారం చేయబోతోంది.