Pradeep Ranganathan: మరో తమిళ సినిమా రిలీజ్ చేయబోతున్న ‘దిల్’ రాజు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ ను ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు తెలుగు వారి ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా నిరుత్సాహపడకుండా ఇప్పుడు మరో తమిళ సినిమాను డబ్ చేసి, రిలీజ్ చేయబోతున్నారు ‘దిల్’ రాజు. తమిళ రచయిత, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ రూపొందించిన ‘లవ్ టుడే’ను ‘దిల్’ రాజు తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇదే నెల 4న తమిళనాట విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది. ఇవానా నాయికగా నటించిన ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సత్యరాజ్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం కూడా ‘లవ్ టుడే’ విజయానికి ప్రధాన కారణమైంది. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయాన్ని చిత్ర కథానాయకుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ అధికారికంగా తెలిపారు. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ పూర్తయిన ఈ సినిమా ఇదే నెల 18న రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. యువతరం మెచ్చే అంశాలతో, కాలేజీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తెలుగువారికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతోనే ‘దిల్’ రాజు పంపిణీ బాధ్యతలను భుజానికెత్తుకున్నారట. మరి ఆయన నమ్మకాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు నిలబెడతారో చూడాలి.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
తాజావార్తలు
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!