'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' ఎపిసోడ్ 5లో ఎంటర్ టైన్ మెంట్ తారాస్థాయికి చేరుకుంది. 'ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్' థీమ్ పై కమెడియన్స్ పోటీపడి వినోదాన్ని పండించారు.
అజిత్ కుమార్ హీరోగా నటించిన 'తెగింపు' సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. అదే రోజున 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేసిన 'వారసుడు' వస్తోంది. విశేషం ఏమంటే... 'వారసుడు'తో పాటు 'తెగింపు' మూవీని నైజాం, వైజాగ్ ఏరియాల్లో పంపిణీ చేసే బాధ్యత 'దిల్' రాజు తీసుకున్నట్టు తెలుస్తోంది.
సుహాస్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'రైటర్ పద్మభూషణ్' మూవీ ఫిబ్రవరి 3వ తేదీ విడుదల కాబోతోంది. విజయవాడ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీతో షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
2022 Filmy Rewind: నలుపు వెనుకే తెలుపు... చీకటి వెనుకే వెలుగు అన్నట్టుగా ఈ యేడాదీ చిత్రసీమ విషాద వినోదాల కలబోతను తలపించింది. ఆగని కాల ప్రవాహంలో 2022 కీలక సంఘటనలకు, విశేష సందర్భాలకు సాక్షిభూతంగా నిలిచింది. తేదీల వారిగా వాటిని ఓసారి గుర్తు చేసుకుందాం.
'వాల్తేరు వీరయ్య' సినిమాటోగ్రాఫర్ ఆర్థర్ ఎ విల్సన్ ను మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల జల్లులో తడిపేశారు. ఆయన క్రాఫ్ట్ మ్యాన్ షిప్ ను అప్రిషియేట్ చేస్తూ ఏకంగా ఓ లెటర్ రాశారు!
ఈ యేడాది లాస్ట్ వీకెండ్ లో ఏకంగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఎనిమిది స్ట్రయిట్ సినిమాలు కాగా రెండు అనువాద చిత్రాలు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ నటించిన 'బట్టర్ ఫ్లై' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
తెలుగు సినిమా రంగానికి చెందిన దిగ్గజ నటులు అభిమానులను శోక సంద్రంలో ముంచి దివికేగారు. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందిన పలువురు ఈ యేడాది కన్నుమూశారు. వయోధిక కారణాలతో కొందరు, కరోనానంతర సమస్యలతో కొందరు చనిపోయారు.