గుణశేఖర్ తెరకెక్కిస్తున్న అద్భుత దృశ్య కావ్యం 'శాకుంతలం' ఫిబ్రవరి 17న విడుదల కానుంది. త్రీడీ లో రాబోతున్న ఈ సినిమా నేపథ్య సంగీతాన్ని హంగేరిలోని బుడాపెస్ట్ సింఫనీ ఆర్కెస్ట్రాలో చేస్తున్నారు.
సంక్రాంతి కానుకగా రాబోతున్న 'వీరసింహారెడ్డి'కి రామజోగయ్య శాస్త్రి సింగిల్ కార్డ్! అంతేకాదు... చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోనూ ఆయనో సూపర్ హిట్ సాంగ్ కు లిరిక్స్ అందించారు.
బిగ్ బాస్ ఫేమ్ యాంకర్ రవి కమర్షియల్స్ లో తన సత్తా చాటుతున్నాడు. జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేశ్ తో కలిసి ఇటీవల 'లూయిస్ పార్క్' ప్రచార చిత్రంలో పాల్గొన్నాడు.
చైతన్యరావ్ కీలక పాత్ర పోషించిన 'ఏ జర్నీ టూ కాశీ' చిత్రం ఈ నెల 6న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శేఖర్ సూరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అవికా గోర్, సాయి రోనక్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం. ఎస్. చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్ను కింగ్ నాగార్జున విడుదల చేశారు.
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, గీత రచయిత పెద్దాడ మూర్తి అనారోగ్యంతో కన్నుమూశారు. పలు పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేసిన ఆయన తమ్మారెడ్డి భరద్వాజ 'కూతురు' చిత్రంతో సినీ గీత రచయితగా తొలి అడుగువేశారు. రెండున్నర దశాబ్దాల కాలంలో వందలాది చిత్రాలకు పాటలు రాశారు.
సాయిరోనక్, అవికాగోర్ జంటగా నటిస్తున్న సినిమా 'పాప్ కార్న్'. ఫిబ్రవరి 10వ తేదీ జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 4న నాగార్జున ఆవిష్కరించబోతున్నారు.