భారతదేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన, మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జీవిత కథ 'బాబూజీ' పేరుతో తెలుగులో తెరకెక్కుతోంది. దిలీప్ రాజా దర్శకత్వంలో ఈ సినిమాను పసుపులేటి నాగేశ్వరరావు, మహమ్మద్ రహంతుల్లా నిర్మిస్తున్నారు.
దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు ఖుదీరామ్ బోస్. అతని బయోపిక్ ను డివిఎస్ రాజు దర్శకత్వంలో విజయ్ జాగర్లమూడి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఆ చిత్రాన్ని ఇవాళ పార్లమెంట్ సభ్యుల కోసం ప్రదర్శించబోతున్నారు.
నందమూరి తారకరత్న హీరోగా నటించిన సినిమా 'ఎస్ -5'. నో ఎగ్జిట్ అనేది ట్యాగ్ లైన్. ఈ నెలాఖరులో జనం ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
2022 Filmy Rewind: సినిమా నిర్మాణం కోట్లతో కూడుకున్న వ్యాపారం. కొత్త వారిని నమ్మి లక్షలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం అంటే మాటలు కాదు. కానీ చిత్రంగా తెలుగులో ప్రతి యేడాది నలభై, యాభై మంది కొత్త దర్శకులు పరిచయం అవుతూనే ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్ సీజన్ 2'లో ఈ వీక్ ఫుల్ గ్లామర్ షోకు ప్రాధాన్యమిచ్చారు. అలనాటి అందాల భామలు జయసుధ, జయప్రదతో పాటు టాలీవుడ్ హాట్ బ్యూటీ రాశీఖన్నా సైతం ఈ షోలో పాల్గొంది.
వెంకట్ కిరణ్, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఎర్రగుడి'. 'అమ్మవారి సాక్షిగా అల్లుకున్న ప్రేమకథ' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు సంజీవ్ మేగోటి దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీకాంత్ శ్రీరామ్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ సోమవారం రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది. కమల్ కామరాజు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను డాక్టర్ రవికిరణ్ గాడలే డైరెక్ట్ చేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6లో శ్రీహాన్ గెలిచి ఓడితే, రేవంత్ ఓడి గెలిచాడు. మొత్తం సీజన్ పట్ల పెద్దంత ఇంట్రస్ట్ చూపించని ఆడియెన్స్, ఆట చివరి రోజు ట్విస్ట్ ను మాత్రం బాగా ఎంజాయ్ చేశారు.