మాస్ మహరాజా రవితేజ నటించిన 'రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. ఇందులోని 'రావణాసుర' ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.
అజయ్ కీలక పాత్ర పోషించిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'చక్రవ్యూహమ్'. చెట్కూరి మధుసూదన్ దర్శకత్వంలో వహించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆ మధ్య సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడానికి కొద్దిరోజుల ముందు ఆవిష్కరించారు.
'కళ్యాణ్ వైభోగమే' చిత్రంలో జంటగా నటించిన నాగశౌర్య, మాళవిక నాయర్ మరోసారి జోడీ కట్టారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వీరు నటిస్తున్న 'ఫలానా అబ్బాయి - పలాయా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విశేష వీక్షకాదరణ అందుకుంటోంది 'ఐరావతం' చిత్రం. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో పడ్డారు నిర్మాతలు 'ఐరావతం ద్విముఖం' పేరుతో పార్ట్ 2కు ప్లాన్ చేస్తున్నారు.
హరీశ్ ధనుంజయ్, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'మరువతరమా'. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేశారు.
వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ యాక్షన్ మూవీ ద్వారా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఇందుకు సహకరించిన చిత్ర బృందానికి, బాలకృష్ణకు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపాడు.
క్లాసిక్ మూవీ 'మాయాబజార్'ను కలర్ చేసిన జగన్ మోహన్ ఇప్పుడు మొదటిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న మల్టీలింగ్వల్ ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ ఇటీవల హైదరాబాద్ లో మొదలైంది.
సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్ర లోకేష్ ను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు. న్యూ ఇయర్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వీరిద్దరూ అనౌన్స్ చేశారు.