లగ్జరీ లైఫ్ పై మోజు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు అది కూడా ఈజీగా సంపాదించాలన్న ఆశతో లంచాలకు పడగలెత్తుతున్నారు కొందరు ప్రభుత్వ అధికారులు. వేలు, లక్షల్లో లంచాలు పుచ్చుకుంటున్నారు. లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం నేరం అని అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులే లంచాలు తీసుకుంటుండడంతో పలువురు మండిపడుతున్నారు. లంచగొండి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ లంచాలకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. తాజాగా నిర్మల్ జిల్లా బైంసాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు సీనియర్ అసిస్టెంట్ భీమన్న.
Also Read:Mamata Banerjee: “జి రామ్ జి” వివాదం.. బెంగాల్ స్కీమ్‌కు మహాత్మా గాంధీ పేరు..
రూ. 9 వేలు ఫోన్ ఫే ద్వారా లంచం పుచ్చుకున్నాడు బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ జీ.భీమన్న. జిపిఎఫ్, సరెండర్ లీవ్, ఎఫ్‌టిఎ బిల్లులను సిద్ధం చేసినందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఫోన్ పే ద్వారా రూ. 9,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోవడంతో ఇక మీరు మారరా అంటూ పలువురు ఫైర్ అవుతున్నారు.