Suhas: ‘చాయ్ బిస్కెట్’లో యూట్యూబ్ వీడియోలతో తన నట జీవితాన్ని ప్రారంభించాడు సుహాస్. అంచలంచెలుగా ఎదుగుతూ హాస్యనటుడిగా, కథానాయకుడిగా మారాడు. అద్భుతమైన ప్రతిభ గల నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తెలుగువారికి చేరువయ్యాడు. అతను హీరోగా నటించిన ‘కలర్ ఫోటో’ మూవీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఇటీవల విడుదలైన ‘హిట్-2’లో ప్రతినాయకుడి పాత్ర పోషించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతని తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్ట్రగులింగ్ రైటర్ పాత్ర పోషించాడు సుహాస్. ఈ సినిమా థియేట్రికల్ విడుదల తేదీని గురువారం ప్రకటించారు.
‘రైటర్ పద్మభూషణ్’ చిత్రంలో రోహిణి, సుహాన్ తల్లీ కొడుకులుగా నటిస్తున్నారు. సుహాస్ వీడియో కాల్ చేసి… తమ మూవీ ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలోకి రాబోతోందనే విషయాన్ని రోహిణిని చెబుతున్న వీడియోను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ‘అదేమిటీ పండక్కి రావడం లేదా? ‘అని రోహిణి ప్రశ్నించడం… ఆర్టీసీబస్ లో సీట్లే దొరకవు, పండక్కి థియేటర్లు మనకు దొరుకుతాయా? అంటూ సుహాన్ బదులివ్వడం సరదాగా ఉంది. ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ పబ్లిసిటీని కూడా క్యూట్ గా తెలియచేయడం బాగుంది. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ లోనూ సుహాస్ చక్కని చిరునవ్వుతో ప్రకాశం బ్యారేజీపై నిలబడిన ఫోజు ఆకట్టుకుంటోంది. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటిస్తోంది. లహరి ఫిల్మ్స్ తో కలిసి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘రైటర్ పద్మభూషణ్’కు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మనోహర్ గోవిందస్వామి సమర్పిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘కన్నుల్లో నీ రూపమే’ ఇప్పటికే చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మూవీ ట్రైలర్ ను త్వరలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
బంధుమిత్రులందరికి చెప్పేయండి❤️
సపరివార సకుటుంబ సమేతంగా సినిమా కి వచ్చేయండి ❤️#WriterPadmabhushan Theatrical Release on Feb 3rd, 2023.@ActorSuhas @TinaShilparaj #ShanmukhaPrasanth @AshishVid @Rohinimolleti @anuragmayreddy @SharathWhat @LahariFilm @LahariMusic pic.twitter.com/e60Xm18kxv— Chai Bisket Films (@ChaiBisketFilms) December 29, 2022