నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. డిసెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఘనవిజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, తాజాగా విలేకరుల సమావేశంలో పాల్గొని మ్యూజిక్ కంపోజింగ్ వెనుక ఉన్న కష్టాన్ని, సవాళ్లను పంచుకున్నారు. సినిమాకు నేపథ్య సంగీతం (BGM) అందించడం ఒక సవాల్‌గా మారిందని తమన్ తెలిపారు.
Also Read:SS Thaman: అఖండ తాండవం కోసం టెక్నాలజీని నమ్మలేదు.. శివాలజీని నమ్మం
“ఈ సినిమా కోసం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడానికి ఏకంగా 73 రోజులు పట్టింది. అందులో మొదటి 20 రోజులు కేవలం శివుని మంత్రాలను ఎంత కొత్తగా వినిపించవచ్చు అనే దానిపైనే కసరత్తు చేశాం. ఆ తర్వాత 40 రోజులు రికార్డింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ పనులకు కేటాయించాం. ‘జాజికాయ’ సాంగ్ మినహా, మిగిలిన ఎనిమిది పాటలు కూడా ఈ 70 రోజుల్లోనే సిద్ధం చేశాం,” అని ఆయన వివరించారు. శివుడికి సంబంధించిన సినిమా చేస్తున్నప్పుడు మెదడు చాలా శుద్ధి అవుతుందని, ఇది తన బ్రెయిన్‌కు ఒక మంచి ఎక్సర్సైజ్ అని తమన్ పేర్కొన్నారు.
Also Read:Malaika: బ్రేకప్ తర్వాత మలైకా అరోరా కొత్త రిలేషన్ షిప్? 17 ఏళ్ల చిన్నోడితో డేటింగ్
దర్శకుడు బోయపాటి శ్రీనుతో పనిచేయడం గురించి చెబుతూ.. “బోయపాటి గారి సినిమాల్లో మొదటి రీల్ నుంచే సవాల్ మొదలవుతుంది. ఆయన ఎనర్జీని అందుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు చేయడం కత్తి మీద సాము లాంటిది. అష్టసిద్ధి, కుంభమేళా ఇంటర్వెల్, ఆది గారి ఎపిసోడ్, హనుమంతుడి సీన్, మరియు క్లైమాక్స్‌లో వచ్చే అవెంజర్స్ తరహా భారీ యాక్షన్ బ్లాక్స్.. వీటన్నిటికీ ప్రాణం పోయడానికి మా టీం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేసింది,” అని తమన్ వెల్లడించారు.
మొదటి భాగం ‘అఖండ’ సమయంలో బోయపాటి గారు తనపై ఉంచిన నమ్మకాన్ని తమన్ గుర్తు చేసుకున్నారు. “అప్పుడు నేను రెండు నెలల సమయం అడిగాను. ఒక రీల్ చేసి చూపించగానే ఆయనకు బాగా నచ్చింది. నా కోసం బడ్జెట్‌ను కూడా పెంచి, వెన్నుముకలా నిలిచి సపోర్ట్ చేశారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే తాపత్రయంతోనే ఈ ‘తాండవం’ కోసం కూడా మరింత కొత్తగా ప్రయత్నించాను,” అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.సనాతన ధర్మాన్ని కమర్షియల్ ఫార్మాట్‌లో అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం, తమన్ అందించిన నేపథ్య సంగీతంతో థియేటర్లలో ప్రేక్షకులను ఒక రకమైన ‘ట్రాన్స్’లోకి తీసుకువెళుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.