Ajith:బోనీకపూర్ మాట కాదనలేక ‘దిల్’ రాజు ‘తెగింపు’!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajith: ప్రముఖ నిర్మాత బోనికపూర్ తమిళంలో వరుసగా అజిత్ తో సినిమాను నిర్మిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన తాజాగా నిర్మించిన ‘తునివు’ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో డబ్ అవుతోంది. సంక్రాంతి కానుకగా దీన్ని జనవరి 12న విడుదల చేయబోతున్నారు. తెలుగు సినిమాను రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్స్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు జిబ్రాన్ స్వరాలు సమకూర్చాడు. మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముతిరఖని వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
విశేషం ఏమంటే… ఈ సినిమాతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ‘వారిసు’ కూడా 12వ తేదీనే రిలీజ్ అవుతోంది. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించాడు. అయితే… నిర్మాత బోనీకపూర్ తో ఉన్న అనుబంధం కారణంగా ‘తెగింపు’ సినిమానూ ‘దిల్’ రాజు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట. అయితే… తన సొంత సినిమా ‘వారసుడు’ కూడా ఉండటంతో ‘దిల్’ రాజు… బోనీ కపూర్ మాట కాదనలేక నైజాం, విశాఖ జిల్లాలో మాత్రమే ‘తెగింపు’ను విడుదల చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. సంక్రాంతికే బరిలో దిగుతున్న చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ చిత్రాలను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రెండింటినీ విజయపథంలోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత వారిమీద పడ్డట్టే, ‘వారసుడు’, ‘తెగింపు’లను సక్సెస్ ట్రాక్ ఎక్కించాల్సిన బాధ్యత ‘దిల్’ రాజు మీద పడింది. మరి సంక్రాంతి బరిలో ఏ సినిమా విజయకేతనం ఎగరేస్తుందో చూడాలి!!
Also Read
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
- Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
తాజావార్తలు
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..