Mayabazar: తెలుగు సినిమా చరిత్రలో ‘మాయబజార్’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం. బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కిన ఈ సినిమాను కొన్నేళ్ళ క్రితం జగన్ మోహన్ కలర్ లోకి మార్చి, విడుదల చేసి, ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అప్పటి నుండి ఆయన పేరు’మాయాబజార్ జగన్మోహన్’గా మారిపోయింది. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని క్లాసిక్స్ కు రంగులు అద్దారు. తాజాగా సి. జగన్ మోహన్ రచయితగా, దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రం ఇటీవల హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో మొదలైంది. టెంపుల్ మీడియా పతాకంపై శ్రీ యతీశ్ అండ్ నందినీ ఈ మల్టీ లింగ్వల్ ఫీచర్ ఫిల్మ్ ను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియచేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.