Maruva Tarama: ప్రేమ కథలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటూనే ఉంటుంది. అయితే మంచి ప్రేమ కథలు ఇప్పుడు అరుదుగా వస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే ఫీల్ గుడ్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ‘మరువతరమా’ అనే చిత్రం రాబోతోంది. ఇందులో హరీష్ ధనుంజయ్ హీరోగా, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా నటించారు. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ మీద గిడుటూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దీనికి చైతన్యవర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు.
ఈ కొత్త ఏడాదిలో ప్రేమను నింపేందుకు తమ ‘మరువ తరమా’ చిత్రం రాబోతోందని మేకర్లు తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేశారు. దీన్ని చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. బీచ్‌లో హీరోహీరోయిన్ల రొమాంటిక్ పోజ్ అందరినీ మెప్పించేలా ఉంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని, మిగతా వివరాలను ప్రకటించనున్నట్టు మేకర్లు తెలిపారు. ఈ చిత్రానికి విజయ్ బుల్గనిన్ సంగీతాన్ని అందిస్తున్నారు.