Phalana Abbayi Phalana Ammayi: దశాబ్దపు ప్రేమ ప్రయాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Shaurya: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. దీనికి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘కళ్యాణ వైభోగమే’ చిత్రంతో వెండితెరపై మ్యాజిక్ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 2022లో ‘ధమాకా’, ‘కార్తికేయ 2’ చిత్రాలతో మరో రెండు భారీ విజయాలను అందుకుంది. ఇదిలా ఉంటే… నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ అనే చిత్రాలు చేశారు. ఈ రెండు చిత్రాలూ వారిలోని ఉత్తమ ప్రతిభను బయటకు తీసుకొచ్చాయి. థియేటర్లలో ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రాలు.. టీవీ, ఓటీటీ లలో ఇప్పటికీ గొప్ప ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ‘ఫలానా అబ్బాయి – ఫలానా అబ్బాయి’తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. నాగ శౌర్య, మాళవిక నాయర్ ఇద్దరూ ఫార్మల్ వింటర్‌వేర్ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు. పోస్టర్ లో అందమైన వస్త్రధారణతో, అంతకంటే అందంగా ఉన్న ఆ జంటను చూస్తుంటే.. ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ ఎప్పుడెప్పుడా చూస్తామా అనే ఆసక్తి కలగక మానదు.
ఆదివారం విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ అనౌన్స్‌మెంట్ వీడియోకి కూడా మంచి స్పందన లభించింది. ఆ వీడియోలో శ్రీనివాస్ అవసరాలతో కాల్ మాట్లాడిన హీరోహీరోయిన్లు సినిమా గురించి ఎటువంటి అప్‌డేట్‌లు లేకపోవడంపై చర్చించారు. “ఆర్ఆర్ఆర్ కూడా విడుదలైంది” అని శౌర్య అనగా.. “‘ఆర్ఆర్ఆర్’ లో మూడే అక్షరాలు ఉన్నాయని, ”ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి” (PAPA) లో నాలుగు అక్షరాలు ఉన్నాయి” అంటూ శ్రీనివాస్ అవసరాల సరదాగా బదులిచ్చారు. ఆ తర్వాత ఫస్ట్ లుక్ జనవరి 2న రాబోతుందని తెలిపారు. ఆ ప్రకారంగా ఈ రోజు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ, ”ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణమే ఈ సినిమా కథ. హెచ్చు తగ్గులతో కూడిన ఆ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. ప్రేమను ఇంద్రధనస్సు లాగా ఏడు విభిన్న రంగులలో దర్శకుడు శ్రీనివాస్ ప్రదర్శించాడు. ఈ చిత్రానికి అతను రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి” అని అన్నారు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
గతంలో నాగశౌర్య – శ్రీనివాస్ అవసరాల కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్, ‘ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి’కి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. విడుదల తేదీతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!