Ajay: సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి సావిత్రి నిర్మిస్తున్న చిత్రం ‘చక్రవ్యూహమ్’. ది ట్రాప్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశేషం ఏమంటే… సూపర్ స్టార్, స్వర్గీయ కృష్ణ తనువు చాలించడానికి కొద్ది రోజుల ముందు ‘చక్రవ్యూహమ్’ పోస్టర్ ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన లాంచ్ చేసిన పోస్టర్ లో పోలీస్ పాత్రలో ఇంటెన్స్ లుక్ తో కనిపించారు అజయ్. మర్డర్ మిస్టరీ క్రైమ్ థిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు దర్శకుడు చెట్కూరి మధుసూదన్ తెలిపారు. ఈ చిత్రాన్ని శ్రీమతి సావిత్రి నిర్మించగా, వెంకటేశ్, అనూష సహ నిర్మాతలుగా వ్యవహరించారు. భరత్ మాచిరాజు సంగీతం అందించారు. జి.వి. అజయ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ త్వరలోనే తెలియచేస్తామని నిర్మాత సావిత్రి చెప్పారు.