Ravi teja: మాస్ మహరాజా రవితేజా ‘ధమాకా’ సినిమా హిట్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశాడు. విశేషం ఏమంటే… జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’లోనూ రవితేజ కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. అంతేకాదు… అతను నటిస్తున్న మరో రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అందులో ఒకటి ‘రావణాసుర’ కాగా మరొకటి ‘టైగర్ నాగేశ్వరరావు’.

ఇందులోని ‘టైగర్ నాగేశ్వరరావు’ స్టువర్ట్ పురంకు చెందిన నాగేశ్వరరావు బయోపిక్. స్టూవర్ట్ పురంలోని దొంగలలో సంస్కరణ తీసుకు రావడం కోసం కృషి చేసి హేమలతా లవణం పాత్రను పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పోషిస్తోంది. ఇక ‘రావణాసుర’ చిత్రంలో సుశాంత్ కీ-రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల డబ్బింగ్ కార్యక్రమాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాన మొదలైంది. ‘రావణాసుర’ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, పూజిత పొన్నాడ నటిస్తుండగా, సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా దీనిని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ను పాన్ ఇండియా మూవీగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో ఓ కీలక పాత్రను అనుపమ్ ఖేర్ పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.