ప్రమోద్ కుమార్ దర్శకత్వంలో ఆర్. బాలాజీ నిర్మిస్తున్న సినిమా 'యుగల్'. దీనికి దర్శకుడు ప్రమోద్ కథ, చిత్రానువాదం సమకూర్చుతున్నారు. రెండు భాగాలుగా వచ్చే ఈ మూవీలో జి.ఎస్.ఎన్. నాయుడు ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు.
మూడు దశాబ్దాల క్రితం సీనియర్ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు తిరుపతి సమీపంలో నెలకొల్పిన శ్రీ విద్యానికేతన్ స్పోర్ట్స్ డే ఇటీవల ఘనంగా జరిగింది. తాజాగా మోహన్ బాబు అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పిన మోహన్ బాబు యూనివర్సిటీ లో ఫిల్మ్ అకాడమిని కూడా ఏర్పాటు చేశారు.
వరలక్ష్మి శరత్ కుమార్ కీ-రోల్ ప్లే చేస్తున్న 'శబరి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంగళవారం 'వరల్డ్ ఆఫ్ శబరి' పేరుతో మేకర్స్ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
గత యేడాది యాక్సిడెంట్ కారణంగా ఎడమ భుజానికి తీవ్ర గాయం కావడంతో గ్లామరస్ బ్యూటీ నభా నటేశ్ సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు పూర్తి గా కోలుకున్నానని, సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్ననని అమ్మడు సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
డస్కీ బ్యూటీ హెబ్బా పటేల్ బర్త్ డే సందర్భంగా ఆమె నటిస్తున్న చిత్రాల దర్శక నిర్మాతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'తెలిసినవాళ్ళు, బ్లాక్ అండ్ వైట్, అలా నిన్ను చేరి' తదితర చిత్రాలలో హెబ్బా పటేల్ నాయికగా నటిస్తోంది.
కన్నడ నటుడు 'దునియా' విజయ్ 'వీరసింహారెడ్డి' చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బాలకృష్ణ సినిమాలో నటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన దేవుడు లాంటి మనిషి అని కొనియాడాడు విజయ్!
యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న సినిమా 'కళ్యాణం కమనీయం'. కోలీవుడ్ భామ ప్రియ భవానీ శంకర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను స్టార్ హీరోయిన్ అనుష్క విడుదల చేసింది.
రెట్టడి శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమా 'రివేంజ్'. బాబు పెదపూడి హీరోగా నటించి, దీనిని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ ఆవిష్కరించారు.
ఛాంబర్ ఆవరణలో టెంట్లు వేసి నిరసన తెలిపిన నిర్మాతలపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ప్రచారం చేస్తున్నట్టుగా ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదని స్పషం చేశారు.
కార్తీక్ రాజు హీరోగా సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్న 'అథర్వ' చిత్రంలో అరవింద్ కృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. నేడు అతని పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది.