మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చిన చిత్రం 'రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం'. జైదీప్ విష్ణు తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
రవీంద్ర గోపాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా 'దేశం కోసం భగత్ సింగ్'. ప్రమోద్ కుమార్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా పాటలను ఫిల్మ్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.
ఆర్యన్ గౌర, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'ఓ సాథియా'. ఈ చిత్రాన్ని దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా నిర్మించారు. విన్ను స్వర రచన చేసిన ఈ మూవీ టైటిల్ సాంగ్ కు విశేష ఆదరణ లభిస్తోంది.
అండమాన్, నికోబార్ లోని 21 ద్వీపాలకు పరమవీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లను పెట్టారు. అందులో ఒక ద్వీపానికి ఖేతర్పాల్ పేరు పెట్టడం పట్ల అల్లు శిరీష్ హర్షం వ్యక్తం చేశాడు.
నటి విమలా రామన్ 'రుద్రంగి' చిత్రంతో టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె పోషిస్తున్న మీరాబాయి పాత్ర ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దీనిని నిర్మిస్తున్నారు.
వర్థమాన నటుడు సుధీర్ వైజాగ్ లో ఆత్మహత్య చేసుకున్నారు. అతనితో పాటు 'కుందనపు బొమ్మ' చిత్రంలో నటించిన సుధాకర్ కొమాకులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
తొలి చిత్రం 'టాప్ గేర్'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కె. శశికాంత్ ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధమౌతున్నాడు. ఓ ప్రముఖ కథానాయకుడి కోసం శశికాంత్ కథను తయారు చేస్తున్నాడు.