Top Gear: గత యేడాది డిసెంబర్ నెలాఖరులో ఆది సాయికుమార్ నటించిన ‘టాప్ గేర్’ మూవీ విడుదలైంది. ఈ సినిమాతో న్యూ డైరెక్టర్ కె. శశికాంత్ పరిచయం అయ్యాడు. ఓ క్యాబ్ డ్రైవర్ కథతో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాతో తన కెరీర్ కు ‘టాప్ గేర్’ వేశాడు శశికాంత్. ఓ డిఫరెంట్ జానర్ ను సెలక్ట్ చేసుకొని ప్రేక్షకుల నుంచి ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేశాడు. గ్రిప్పింగ్ గా స్టోరీని నడిపిస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో శశికాంత్ విజయం సాధించాడు. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కడమే గాక ప్రేక్షకులకు వినూత్న అనుభూతి కలిగించింది. ఇవాళ ఓ మూవీ సక్సెస్ కావాలంటే అందులో ప్రధానపాత్ర దర్శకుడిదే. కథలో ఉన్న బలానికి ఆసక్తికర కథనాన్ని జోడించి ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో దర్శకుడిదే ముఖ్య పాత్ర. ప్రతి ఫ్రేమ్ కూడా బ్యూటిఫుల్‌గా ప్రెజెంట్ చేస్తూ సన్నివేశాల మేళవింపుగా సినిమాను తెరకెక్కించడంలోనే దర్శకుడి నైపుణ్యం బయటపడుతుంది. తన తొలి చిత్రం’టాప్ గేర్’తో కె.శశికాంత్ అదే నిరూపించుకున్నారు. తన నైపుణ్యం వెలికితీసి జనం దృష్టిలో పడ్డారు.
త్వరలోనే ‘టాప్ గేర్’ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ కాబోతోంది. తొలి చిత్రంతోనే చక్కని గుర్తింపు తెచ్చుకున్న కె. శశికాంత్ ప్రస్తుతం తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టారు. ప్రముఖ హీరోతో శశికాంత్ నెక్స్ట్ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు సాగుతున్నాయి. ‘టాప్ గేర్’ లాగే మరో డిఫరెంట్ పాయింట్ తీసుకొని స్టోరీ సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.