ఆహాలో ప్రసారం అవుతున్న 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్'కు వారం వారం వ్యూవర్స్ నుండి రెస్పాన్స్ పెరుగుతూ ఉంది. తాజా ఎపిసోడ్ లో యూనిక్ పర్సనాలిటీస్ థీమ్ నవ్వుల పువ్వుల్ని పూయించింది.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకున్న మన్సూర్ దలాల్ అనే నకిలీ నోట్ల ముఠా నాయకుడిగా కె.కె. మీనన్ 'ఫర్జీ' వెబ్ సీరిస్ లో నటించాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ లోని మన్పూర్ దలాల్ క్యారెక్టర్ వీడియోను అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది.
అందాల నాయిక హన్సికా మోత్వాని గత యేడాది డిసెంబర్ 4న తన బోయ్ ఫ్రెండ్ సోహెల్ ఖటూరియాను పెళ్ళి చేసుకుంది. విశేషం ఏమంటే... తన ప్రేమ పెళ్ళి.. అది జరిగిన సందర్భంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆమె 'హన్సికాస్ లవ్ షాదీ డ్రామా' పేరుతో ఓ స్పెషల్ షో చేసింది. దీన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ చేయబోతోంది.
ఒకప్పటి బాలనటి అనికా సురేంద్రన్ హీరోయిన్ గా నటించిన సినిమా 'బుట్టబొమ్మ'. మలయాళ మాతృక 'కప్పెలా' కంటే 'బుట్టబొమ్మ' కలర్ ఫుల్ గా ఉంటుందని అనికా చెబుతోంది.
అవికాగోర్, సాయిరోనర్ జంటగా నటించిన 'పాప్ కార్న్' మూవీలోని 'మది విహంగమయ్యే' గీతాన్ని యంగ్ హీరో నాగ చైతన్య విడుదల చేశారు. ఈ మూవీతో మురళీ గంధం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
'హిట్' సినిమాలో తన టాలెంట్ బయటపెట్టి సక్సెస్ అందుకున్న రుహాని... అదే బాటలో ఇప్పుడు 'హర్' అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ టీజర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
'శుక్ర', 'మాటరాని మౌనమిది' చిత్రాలతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకు పూర్వాజ్ ఇప్పుడు 'ఏ మాస్టర్ పీస్' పేరుతో మూడో సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని సూపర్ లుక్ తాజాగా విడుదలైంది.