Aryan Gowra: ఆకట్టుకుంటోన్న ‘ఓ సాథియా’ టైటిల్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘O Saathiya’: ప్రస్తుతం ఉన్న సినిమాలకు సంగీతం ఎంతగా ప్లస్ అవుతుందో అందరికీ తెలిసిందే. పాటలు బాగుంటే, సంగీతానికి మంచి ఆదరణ లభిస్తే సినిమాలు హిట్ అవుతాయని అంతా నమ్ముతుంటారు. ఇక ప్రేమ పాటలు, మెలోడీ సాంగ్స్ జనాలకు ఎప్పుడూ నచ్చేస్తుంటాయి. అలాంటి చక్కటి మెలోడి గీతాలతో, మంచి ప్రేమ కథతో ‘ఓ సాథియా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు దర్శకనిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్ మీద చందన కట్టా ‘ఓ సాథియా’ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు.
‘ఓ సాథియా’ సినిమాలో ఆర్యన్ గౌర, మిస్టి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్యన్ గౌర అంతకు ముందు ‘జీ జాంబీ’ మూవీలో హీరోగా నటించాడు. మిస్టి చక్రవర్తి ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో కథానాయికగా నటించింది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ చేతుల మీదగా రీసెంట్‌గా విడుదల చేసిన ‘ఓ సాథియా’ టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది. వన్ మిలియన్ వ్యూస్‌కు చేరువలో ఉన్న పాటలో, భాస్కర భట్ల సాహిత్యం, విన్ను అందించిన బాణీ, జావెద్ అలీ గాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ లిరికల్ వీడియోలోని విజువల్స్ చూస్తే సినిమాను ఎంత రిచ్‌గా తీశారో అర్థమవుతుంది. ఈజే వేణు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుందని దర్శకురాలు దివ్వా భావన తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
తాజావార్తలు
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!